AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Loss: జుట్టు రాలుతుందా? అయితే వెంటనే ఆ అలవాట్లను మార్చుకోండి.. లేకుంటే మిగిలేది గుండే..

ప్రస్తుత జీవన విధానంతో చాలా మందికి జట్టు రాలిపోతుంది(Hair Fall). మహిళలతోపాటు పురుషుల్లో కూడా హెయిర్ ఫాల్ సమస్య పెరుగుతోంది. పురుషులలో జుట్టు రాలడానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి...

Hair Loss: జుట్టు రాలుతుందా? అయితే వెంటనే ఆ అలవాట్లను మార్చుకోండి.. లేకుంటే మిగిలేది గుండే..
Hair Loss
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Mar 22, 2022 | 6:50 PM

ప్రస్తుత జీవన విధానంతో చాలా మందికి జట్టు రాలిపోతుంది(Hair Fall). మహిళలతోపాటు పురుషుల్లో కూడా హెయిర్ ఫాల్ సమస్య పెరుగుతోంది. పురుషులలో జుట్టు రాలడానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. అయితే మగవారి జుట్టు ఎందుకు రాలుతుంది, దానికి పరిష్కారం ఏమిటో తెలుసుకుందాం. జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఈస్ట్రోజెనిక్ అలోపేసియా (పురుషుల బట్టతల). ఇది మగవారిలో కనిపించే DTH హార్మోన్(Hormone) (డైహైడ్రోటెస్టోస్టెరాన్) అసమతుల్యత కారణంగా వస్తుంది. ఇందులో పురుషుల తలలోని ఒక భాగం నుంచి జుట్టు వేగంగా రాలడం ప్రారంభమవుతుంది. 30 శాతం మంది పురుషులలో.. ఈ సమస్య 30 సంవత్సరాల వయస్సులో మొదలవుతుందని అంచనా. హార్మోన్ల మార్పుల వల్ల కూడా మగవారిలో జట్టు రాలుతుంది. జుట్టు రాలడానికి మరో ప్రధాన కారణం టెస్టోస్టెరాన్(testosterone) అనే సెక్స్ హార్మోన్. అంతేకాకుండా జన్యుమార్పుల వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది.

ఈ అలవాట్లను మానుకోవాలి

వేడి నీళ్లతో స్నానం: స్నానానికి వేడినీటిని ఉపయోగించడం కంటే చల్లటి నీటితో స్నానం చేయడం చాలా ఉత్తమమని చాలా మంది సౌందర్య నిపుణల అభిప్రాయం. వేడినీళ్లతో తలస్నానం చేయడం వల్ల వెంట్రుకలు డ్యామేజ్ అవుతాయి. ఎక్కువ వేడిగా ఉన్న నీళ్లను తలపై పోసుకోవడం వల్ల తల వెంట్రుకులకు సంబంధించిన ఫోలీ సెల్స్ తెరుచుకోవడంతో తలవెంట్రుకలు రాలిపోయే ప్రమాదం ఉంది.

గట్టిగా తలదువ్వడం: జుట్టు రాలడంలో గట్టిగ తలదువ్వడం ఒక ప్రధానమైన కారణం. తల దువ్వవే సమయంలో తలమాడుకు ఎక్కువ ప్రెజర్ పెట్టి దువ్వకూడదు. దాని వల్ల వెంట్రుకు చిక్కు పడి రాలిపోయే ప్రమాదం ఉంది. తల దువ్వేటప్పుడు ముందుగా పెద్ద పళ్లు ఉన్న దువ్వెనలతో చిక్కుముడులు వదిలించి, ఆ తర్వాతే వేరే దువ్వెనతో మృధువుగా దువ్వుకోవాలి. లేదంటే చిక్కుముడులతో లాగడం వల్ల వెంట్రుకలు తెగిపోయే ప్రమాదం ఉంది.

తడితల దువ్వడం: మీరు తలస్నానం చేసినప్పుడు కురులు ఆరే వరకు తలదువ్వకూడదు. తల స్నానం చేసినప్పుడు వెంట్రుకలు బలహీనపడుతాయి. టైమ్ లేదనో.. మరేదైనా కారణం చేతనో చాలా మంది చేసే పెద్ద తప్పు తల తడిగా ఉన్పప్పుడే తలదువ్వుతుంటారు. తడి మీద తలదువ్వడంతో వెంట్రుకలు సెట్ చేసినట్లు అవుతుందని నమ్ముతుంటారు. ఒకే షేప్‌లో ఉంటుందనుకొంటారు. అయితే అలా చేయడం మంచి పద్దతి కాదు. దాని వల్ల ఎక్కువగా జుట్టు రాలే సమస్య ఏర్పడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

Read also.. Vitamin D: మీకు విటమిన్ D లోపం ఉందా.. అయితే ప్రమాదంలో పడినట్లే..

తెలంగాణలో బీర్లకు పెరిగిన డిమాండ్‌..రోజుకు ఎన్ని తాగుతున్నారంటే?
తెలంగాణలో బీర్లకు పెరిగిన డిమాండ్‌..రోజుకు ఎన్ని తాగుతున్నారంటే?
ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన ప్రీతి జింతా!
ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన ప్రీతి జింతా!
నల్ల యాలకులతో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు..? ఎన్నో రోగాలకు చెక్
నల్ల యాలకులతో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు..? ఎన్నో రోగాలకు చెక్
వారమంతా చికెన్ లాగించేస్తున్నారా.. ఈ రిస్క్ ఉంది జాగ్రత్త!
వారమంతా చికెన్ లాగించేస్తున్నారా.. ఈ రిస్క్ ఉంది జాగ్రత్త!
ట్రెండింగ్‌లో 'ఆవిడే మా ఆవిడే' సెకెండ్ హీరోయిన్?ఇప్పుడెలా ఉందంటే?
ట్రెండింగ్‌లో 'ఆవిడే మా ఆవిడే' సెకెండ్ హీరోయిన్?ఇప్పుడెలా ఉందంటే?
30 రోజుల పాటు పరగడుపున నానబెట్టిన పల్లీలు తింటే ఏమౌతుందో తెలుసా.?
30 రోజుల పాటు పరగడుపున నానబెట్టిన పల్లీలు తింటే ఏమౌతుందో తెలుసా.?
చిన్నారి ప్రాణం తీసిన పల్లిగింజ.. ఇంట్లో సరదాగా ఆడుకుంటూ...
చిన్నారి ప్రాణం తీసిన పల్లిగింజ.. ఇంట్లో సరదాగా ఆడుకుంటూ...
పండ్లు, కూరగాయలలో పురుగు మందులను గుర్తించడానికి పతంజలి పరిశోధన..
పండ్లు, కూరగాయలలో పురుగు మందులను గుర్తించడానికి పతంజలి పరిశోధన..
నల్ల వెల్లుల్లితో ఇన్ని లాభాలా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
నల్ల వెల్లుల్లితో ఇన్ని లాభాలా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
క్రికెట్ కోసం ఎంతో ఇష్టమైన ఆ రెండింటిని వదిలేసిన వైభవ్ సూర్యవంశీ
క్రికెట్ కోసం ఎంతో ఇష్టమైన ఆ రెండింటిని వదిలేసిన వైభవ్ సూర్యవంశీ