Health Tips: కారంగా ఉన్నా మంచిదే.. పచ్చిమిర్చితో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..

పచ్చి మిరపకాయలు తింటే గుండెల్లో మంట, ఎసిడిటీ సమస్యలు వస్తాయని అంతా భావిస్తుంటారు. కానీ, అదే సమయంలో వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Health Tips: కారంగా ఉన్నా మంచిదే.. పచ్చిమిర్చితో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..
Green Chillies
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 01, 2023 | 8:03 PM

పచ్చి మిరపకాయలు తింటే గుండెల్లో మంట, ఎసిడిటీ సమస్యలు వస్తాయని అంతా భావిస్తుంటారు. కానీ, అదే సమయంలో వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చిమిర్చిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6 ఉంటాయి. అంతేకాకుండా, ఇందులో క్యాప్సైసిన్, కెరోటిన్, క్రిప్టోక్సాంటిన్, లుటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులు, గుండె జబ్బుల నుండి రక్షిస్తాయి. అమైనో ఆమ్లాలు, ఫోలిక్ ఆమ్లం, ఆస్కార్బిక్ ఆమ్లం కలిగి ఉంటుంది. ఇది జీర్ణసంబంధిత ఎంజైమ్‌లను పెంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ సహాయపడుతుంది. పచ్చిమిర్చి తినడం వలన కలిగే మరిన్ని ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

హై బీపీ నియంత్రణ..

పచ్చిమిర్చిలో క్యాప్సైసిన్ ఉంటుంది. అందుకే బీపీ సమస్య ఉన్నవారు పచ్చిమిర్చి తినాలని సూచిస్తుంటారు. ఎందుకంటే మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ రక్తనాళాలను రిలాక్స్ చేస్తుంది. దానిలోని సిట్రిక్ యాసిడ్‌ రక్తాన్ని పలుచగా చేస్తుంది. ఇది హై బీపీ సమస్యను నియంత్రిస్తుంది.

చర్మ రక్షణ..

విటమిన్ సి పచ్చి మిరపకాయలలో అధిక మొత్తంలో లభిస్తుంది. ఇది చర్మం మరింత కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. పచ్చి మిరపకాయలు చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇందులో విటమిన్ ఇ కూడా ఉంటుంది. ఇది వృద్ధాప్యంతో పోరాడటానికి, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఐరన్ లోపం తగ్గుతుంది..

పచ్చి మిరపకాయల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరంలో ఐరన్ లోపం ఉన్నవారు అలసిపోతారు. ఇలాంటి వారు తమ ఆహారంలో పచ్చిమిర్చిని చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

కంటికి మంచిది..

విటమిన్ ఎ వంటి పోషకాలు పచ్చి మిర్చిలో ఉన్నాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది వృద్ధాప్యం నుండి రక్షిస్తుంది. కంటిశుక్లం వంటి సమస్యలను తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది.

రుమాటిజంలో మేలు చేస్తుంది..

పచ్చి మిరపకాయల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ రోగులకు ఉపశమనం కలిగిస్తుంది. ఇది ఎముకలలో వాపు, నొప్పిని తగ్గిస్తుంది. పచ్చి మిరపకాయలో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా చేస్తుంది.

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది..

పచ్చిమిర్చిలో ఉండే క్యాప్సైసిన్ సమ్మేళనం ఘాటుగా ఉంటుంది. మిరిపకాయ తినడం వల్ల రక్తం శుభ్రమవుతుంది. సిరల్లో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. పచ్చిమిర్చిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ సమతుల్యంగా ఉంటుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది..

పచ్చిమిర్చిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..