Health Benefits of Fish: సీ ఫుడ్ లో బెస్ట్ చేపలు.. వీటిని తినడం వలన శరీరానికి కలిగే మేలు ఏమిటంటే..!

Health Benefits of Fish:మనుషుల్లో శాఖాహారులు, మాంసాహారులు ఉన్నారు. మాంసారులు చికెన్, మటన్, లతో పాటు సి ఫుడ్ అయిన రొయ్యలు, చేపలు, పీతలు వంటి..

Health Benefits of Fish: సీ ఫుడ్ లో బెస్ట్ చేపలు.. వీటిని తినడం వలన శరీరానికి కలిగే మేలు ఏమిటంటే..!
Fish
Follow us

|

Updated on: Jun 09, 2021 | 11:03 AM

Health Benefits of Fish:మనుషుల్లో శాఖాహారులు, మాంసాహారులు ఉన్నారు. మాంసారులు చికెన్, మటన్, లతో పాటు సి ఫుడ్ అయిన రొయ్యలు, చేపలు, పీతలు వంటి వాటిని తింటారు. వీటిల్లో చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదని.. ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెప్పారు. చేపలు తింటే శరీరానికి చేసే మేలు.. అందే పోషకాల గురించి తెలుసుకుందాం..

* చేపల్లో మాంసకృతులతో పాటు శరీరానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. కాల్షియం, పాస్పరస్‌, ఐరన్‌, మెగ్నీషియం, కాపర్‌, జింక్‌ వంటి ఖనిజ పోషకాలు ఎన్నో లభిస్తాయి. *చేపలు గుండెకు సంబంధిత వ్యాధులకు , ఆస్తమా , షుగగర్‌ వ్యాధి గ్రస్తులకు మంచి ఆహారంగా పని చేస్తుంది. * చేపల కొవ్వు చాలా సులభంగా జీర్ణమై శక్తిని అందిస్తాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎవరైనా తినవచ్చు. * చేపల్లో ఉన్న కొవ్వు మన శరీరంలో రక్త పీడనంపై మంచి ప్రభావం చూపుతుంది. * ఓమేగా 3 కొవ్వు ఆమ్లాలలో డీహెచ్‌ఏ, ఈపీఏ వంటివి కంటి చూపునకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే జ్ఞాపకశక్తిని కూడా పెంచుతాయి. * చేపల్లో బీ12 విటమిన్‌, రైబోప్లవిన్‌, నియాసిన్‌, బయెటిక్‌, థయామిన్‌ తదితర విటమిన్లు లభిస్తాయి. * గర్భిణీ స్త్రీలతో పాటు, పిల్లల తల్లులకు చేపలు ఎంతో మేలు చేస్తాయి. పిల్లల్లో జ్ఞాపకశక్తి , నాడీ వ్యవస్థను అభివృద్ధి చేస్తాయి. * చేపలు తినడం వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు , ఆస్తమా , మధుమోహ వ్యాధి ఉన్న వారు చేపలు తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. * సముద్ర చేపల కాలేయంలో విటమిన్‌ ఏ , డీ , ఈ వంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. * ఆంధ్రప్రదేశ్ లో చేపల్లో కొర్రమీనులో లభించే ఆరాఖిడోనిక్‌ ఆమ్లం ఉంటుంది. ఇది గాయాలైనప్పుడు రక్తం తొందరగా గడ్డకట్టించే స్వభావం ఉంటుంది. *కరోనా సమయంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి చేపలు మంచి ఆహారమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: రాజు పాలన, శత్రువుని ఏ విధంగా జయించాలో ధర్మరాజుకి చెప్పిన భీష్ముడు