AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cucumber Benefits: కీరదోస తింటే ఆ జబ్బులన్నింటికీ చెక్ పెట్టినట్లే.. అవేంటంటే..?

Benefits of Cucumber: ఆధునిక ప్రపంచంలో పని ఒత్తిడితో చాలా మంది అనేక రోగాల బారిన పడుతున్నారు. అయితే అలాంటి వారు కొన్ని రకాల ఆహార పద్దతులను పాటిస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎన్నో జబ్బులకు కొన్ని ఆహార

Cucumber Benefits: కీరదోస తింటే ఆ జబ్బులన్నింటికీ చెక్ పెట్టినట్లే.. అవేంటంటే..?
Cucumber
Shaik Madar Saheb
|

Updated on: Jun 09, 2021 | 12:31 PM

Share
Benefits of Cucumber: ఆధునిక ప్రపంచంలో పని ఒత్తిడితో చాలా మంది అనేక రోగాల బారిన పడుతున్నారు. అయితే అలాంటి వారు కొన్ని రకాల ఆహార పద్దతులను పాటిస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎన్నో జబ్బులకు కొన్ని ఆహార పదార్థాలు దివ్యఔషధంలా పనిచేస్తాయి. అలాంటి వాటిల్లో కీర దోసకాయ ఒకటి. కీరదోసల్లో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తినడం వల్ల పలు జబ్బులు సులభంగా నయమవుతాయి. అందుకే వీటిని ఎక్కువగా సలాడ్స్‌లో ఉపయోగిస్తారు. అంతేకాకుండా స్నాక్స్ లా తింటుంటారు. ఈ కీర దోస ఉపయోగాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కీర దోసకాయ శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఊబకాయంతో బాధపడేవారికి కూడా కీరదోస మంచి ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు డయాబెటిస్ ను కూడా నియంత్రణలో ఉంచడంలో కీరదోస కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలో చక్కర నిల్వలను తగ్గించి షుగర్ ను అదుపులో ఉంచుతుంది. అందువల్ల షుగర్ ఉన్న వారు ఎక్కువగా తినాలని సూచిస్తున్నారు. కీరదోసకాయలో మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, ఐరన్ వంటి విటమిన్లు ఉన్నాయి. దీనిని తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లు కూడా కరిగిపోయి.. మూత్ర సమస్యలు తగ్గుతాయి. కీరదోసలో కాన్సర్ ను నిరోధించే గుణాలు సైతం ఉన్నాయి.
కీరదోసలో ఉండే విటమిన్లు బ్లడ్ ప్రెజర్‌ను తగ్గించి.. రక్త ప్రసరణ మంగా జరిగేలా సహకరిస్తాయి. వీటిలో 95 శాతం నీరు ఉండడం వల్ల వేసవిలో శరీరం డీహైడ్రేషన్ అవ్వకుండా కాపాడుతుంది. దీనిలో ఉండే విటమిన్ ‘బి’తలనొప్పిని వెంటనే తగ్గించి ప్రశాంతంగా ఉండేలా దోహదపడుతుంది.