Health Tips: కరోనాను నయం చేయడానికి గ్రీన్ టీ సహయపడుతుందా ? అధ్యాయనాలు ఏం చెబుతున్నాయంటే..
కరోనా రెండో దశ .. యావత్ భారతాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోగా..స్మశానాలు సైతం రద్దీగా మారిపోయాయి.
కరోనా రెండో దశ .. యావత్ భారతాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోగా..స్మశానాలు సైతం రద్దీగా మారిపోయాయి. కరోనాను నియంత్రించడానికి రోగ నిరోధక శక్తి ఉండాలను డాక్టర్స్ సూచించడంతో.. అనేక మంది పూర్వపు వంటకాల పద్ధతిని అవలంభించడం మొదలు పెట్టారు. కషాయాలు, సహజ వనరులతో చేసిన వంటలను తినడం ప్రారంభించారు. ఇక సోషల్ మీడియాలో ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్ అంటూ అనేక రకాల ఆహార పదార్థాలకు సంబంధించిన వార్తలు, వీడియో కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఆర్ఎస్సీ అడ్వాన్సెస్ జర్నల్ లో ప్రచురించిన ఓ అధ్యాయనం ప్రకారం కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి గ్రీన్ టీ ఎక్కువగా పనిచేస్తుందట.
భారత్‌లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో కోవిడ్ నియంత్రణకు గ్రీన్ టీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి కొందరు పరిశోధకుల బృందం పరీక్షించింది. ఈ అధ్యాయనంలో గ్రీన్ టీ సమ్మేళానాలలో ఉండే ఒకటి కోవిడ్ ను ఎదుర్కోగలదని ప్రాథమిక పరిశోధనలు వెల్లడించాయి. కరోనా నియంత్రణకు గ్రీన్ టీ ఏవిధంగా ఉపయోగపడుతుందో తెలుసుకోవడానికి.. స్వాన్సీ యూనివర్సిటీ మెడికల్ స్కూల్ ప్రధాన అధికారి సురేష్ మోహన్కుమార్ తన బృందంతో కలిసి జెఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో పరిశోధనలు జరిపారు. పూర్వపు వంటకాలు, వంట విధానాలు.. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో మిక్కిలి పాత్ర పోషిస్తాయని సందేహం తమకు కలిగిందని డాక్టర్ మోహన్కుమార్ అన్నారు. ప్రస్తుత కంప్యూటర్ ప్రోగ్రామ్ ఉపయోగించి ఇతర కరోనా వైరస్ కు వ్యతిరేకంగా పోరాడే సమ్మేళనాలను పరిక్షీంచామని తెలిపారు. ఆర్ఎస్సీ అడ్వాన్సె్స్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో పరిశోధన ఇంకా ప్రారంభదశలోనే ఉందని.. ఎలాంటి క్లినికల్ అప్లికేషన్ చాలా ప్రాసెస్‌లో ఉందన్నారు. అయితే గ్రీన్ టీ కోవిడ్ నియంత్రణకు ఉపయోగపడుతుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అంటు వ్యాధులను నియంత్రించడానికి ఉపయోగపడే సమ్మేళనాలు మాత్రం గ్రీన్ టీలో పుష్కలంగా ఉన్నాయన్నారు.
Peanut & Jaggery Benefits: పల్లీలు, బెల్లం కలిపి తింటున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..