Health Tips: పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుదలకు అత్యత్తమ మార్గాలు.. వీటిని పాటిస్తే 40 ఏళ్ల తరువాత కూడా..
Health Tips: లైంగిక సమస్యలపై చర్చించడం భారతీయ సమాజంలో నిషిద్ధంగా భావిస్తారు. వాటి గురించి బహిరంగంగా ప్రస్తావిస్తే మహాపాపంగా భావిస్తారు.
Health Tips: లైంగిక సమస్యలపై చర్చించడం భారతీయ సమాజంలో నిషిద్ధంగా భావిస్తారు. వాటి గురించి బహిరంగంగా ప్రస్తావిస్తే మహాపాపంగా భావిస్తారు. లైంగిక సమస్యల అంశాల్లో ప్రజల్లో నెలకొన్న న్యూనతా భావం కారణంగా చాలా మంది అనేక దుష్ప్రభావాలను ఎదుర్కొనవలసి వస్తోంది. అనేక సమస్యలతో వారిలో వారే మగ్గిపోవలసి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం లైంగిక ఆరోగ్యం అంశం బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. లైంగిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం అని ఇప్పుడిప్పుడే ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. లైంగికంగా ఆరోగ్యంగా ఉండేందుకు పరిశోధకలు కొన్ని సూచనలు, సలహాలు ఇస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇతర ఆరోగ్యం మాదరిగానే.. లైంగిక ఆరోగ్యం మీ జీవనశైలికి దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. మీ ఆహారం, నిద్ర, వ్యాయామం లైంగిక శక్తిని పెంపొందించడానికి దోహదపడుతాయి. కావున, ఈ విషయాల్లో సరైన నిర్ణయం తీసుకుంటేనే ఆరోగ్యకరమైన లైంగిక జీవితానికి మార్గం సుగమం అవుతుంది.
తగినంత నిద్ర ముఖ్యం.. పరిశోధకులు జరిపిన అధ్యయనం ప్రకారం.. రాత్రి 7 గంటలకు పైగా నిద్రపోయే 31.7 శాతం మంది పురుషులకు సెక్స్ సమయంలో అంగస్తంభన సమస్యలు ఉండవు. నిద్ర మీ లైంగిక జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో ఇది చూపిస్తుంది.
రోజువారీ వ్యాయామం అవసరం.. నిద్ర మాదిరిగానే.. రోజువారీ వ్యాయామం కూడా లైంగిక ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే పురుషులలో 27% మంది శృంగార అనుభూతిని పూర్తిగా ఆస్వాధిస్తారని పరిశోధనలో తేలింది. వ్యాయామం, స్ఖలన సమయానికి దగ్గరి సంబంధం ఉందని తేల్చారు.
40 సంవత్సరాల వయస్సు తర్వాత ప్రతి సంవత్సరం పురుషుల్లో టెస్టోస్టెరాన్లు 1 శాతం తగ్గుతుంది.. పురుషుల లైంగిక ఆరోగ్యం విషయంలో వారి శరీరంలోని టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ పాత్ర ముఖ్యమైనది. అలాగే పురుషుల వయస్సు లైంగిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీని ప్రకారం, 40 సంవత్సరాల వయస్సు తరువాత, మనిషి శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయి ప్రతి సంవత్సరం 1 శాతం మేర తగ్గుతుంది. యవ్వనంలో పురుషుల శరీరంలో అదే మొత్తంలో టెస్టోస్టెరాన్ పుష్కలంగా ఉంటుంది. టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గడం వల్ల లిబిడో, అకాల స్ఖలనం వంటి అనేక ఇతర సమస్యలు వస్తాయి. అందుకే వయసుతో పాటు టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచడానికి డాక్టర్ సలహా ప్రకారం కొన్ని మందులు తీసుకోవడం అవసరం.
Also read:
Tokyo Olympics: కోచ్‌లు, ఫిజియోల సంఖ్యను పెంచండి …ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కు లేఖ