NIN Study: దేశంలో మూప్పై శాతం మంది చిన్నారుల్లో ఐరన్ లోపం.. వెలుగులోకి సంచలన విషయాలు…
మన దేశంలోని చిన్నారులు, కౌమరదశలో ఉన్న పిల్లలలో ఐరన్ లోపం అధికంగా ఉందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) వెల్లడించింది.
మన దేశంలోని చిన్నారులు, కౌమరదశలో ఉన్న పిల్లలలో ఐరన్ లోపం అధికంగా ఉందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న చిన్నారుల్లో 30 నుంచి 32 శాతం మంది పిల్లలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారని పేర్కోంది. ఐదు నుంచి తొమ్మిదేళ్ల పిల్లలలో 11 నుంచి 15 శాతం మంది పిల్లలు మాత్రమే ఐరన్ లోపం ఉందని పరిశోధకులు తెలిపారు. దేశంలోని ప్రీమియర్ న్యూట్రిషన్ ఏజెన్సీ చేసిన పాన్ ఇండియా అధ్యయనంలో చాలా మంది చిన్నారులు ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకున్నప్పటికీ.. వారి శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉందని.. దీంతో వారు రక్తహీనతకు గురయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
పట్టణాల్లో ఉండే పిల్లలో ఐరన్ శాతం ఎక్కువగా ఉందని.. కానీ అందుకు పూర్తి భిన్నంగా గ్రామీణ, పేద వర్గాలకు చెందిన పిల్లల్లో ఐరన్ శాతం తక్కువగా ఉందని తెలిపింది. పేద పిల్లలు, కౌమర దశలో ఉన్న చిన్నారులలో హిమోగ్లోబిన్ లో నిల్వ ఉండే ఐరన్… మిగత శరీర భాగాలను అందడం లేదని.. NIN పరిశోధన అధికారి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ భారతి కులకర్ణి అన్నారు. చిన్నారులకు కేవలం ఐరన్ ఉన్న ఆహారం మాత్రమే తినిపించాల్సిన అవసరం లేదని.. వారి శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి ఇతర పోషకాలు ఉన్న ఆహారం కూడా ఇవాలని ఆమె అన్నారు.
పేద వర్గాల్లో హిమోగ్లోబిన్ శాతం.. ఐరన్ లోపం ఉన్న పిల్లల్లో మాంసం, పండ్లు వంటి పోషక పదార్థాలను తక్కువగా తీసుకోవడం వలనే ఈ సమస్యలు ఎదురైనట్లు చెప్పారు. అలాగే పరిశుభ్రంగా లేని వాతావరణంలో నివసించే పిల్లల్లో అంటువ్యాధులు ఐరన్ లోపం, హిమోగ్లోబిన్ స్థాయిని తగ్గిస్తాయని ఎన్ఐఎన్ రూపొందించిన జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురితమైంది. కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్యర్యంలో 2016-18 మధ్యకాలంలో సమగ్ర జాతీయ పౌష్టికాహార అధ్యయనం (సీఎన్‌ఎన్‌ఎస్)లో భాగంగా సేకరించిన రక్త నమూనాలను విశ్లేషించడం ద్వారా ఈ అధ్యయనాన్ని నిర్వహించినట్లు ఐసీఎంఆర్-ఎన్‌ఐఎన్ డైరెక్టర్, డాక్టర్ ఆర్.హేమలత తెలిపారు. ఇందులో భాగంగా 33వేల మంది చిన్నారులు, కౌమార దశ బాలల రక్త నమూనాలను పరీక్షించినట్లు పేర్కొన్నారు. ఈ నివేదిక ప్రకారం.. 30-32 శాతం ప్రీ స్కూల్ పిల్లలు, కౌమారదశ బాలికలలో ఐరన్ లోపం కనిపించింది. అయితే 5-9 సంవత్సరాలలోపు పిల్లల్లో ఇది తక్కువగా (11-15%)గా ఉంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేల ప్రకారం.. 40-50% మంది మహిళలలో, పిల్లల్లో ఈ సమస్య అధికంగా ఉందని ఆమె తెలిపారు. ఆహారం నాణ్యత, అంటువ్యాధులను నివారించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు తెలిపారు.