AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CRPF, BSF to drop jawans: ఫిట్‌గా ఉంటేనే ఉద్యోగం.. కేంద్ర పారామిలిటరీ దళాల షేప్‌-5 జవాన్లకు ఉద్వాసన.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం!

కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్‌), సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌)లలో శారీరకంగా దారుఢ్యంగా లేని సిబ్బందిని కొలువు నుంచి సాగనంపాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది

CRPF, BSF to drop jawans: ఫిట్‌గా ఉంటేనే ఉద్యోగం.. కేంద్ర పారామిలిటరీ దళాల షేప్‌-5 జవాన్లకు ఉద్వాసన.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం!
Crpf, Bsf To Drop Jawans Placed Under The 'lowest Medical Category'
Balaraju Goud
|

Updated on: Jun 09, 2021 | 8:51 AM

Share

కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్‌), సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌)లలో శారీరకంగా దారుఢ్యంగా లేని సిబ్బందిని కొలువు నుంచి సాగనంపాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ మరియు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనర్హమైన సిబ్బందిలో కొన్ని వందల మందిని అన్‌ఫిట్‌ క్రింద తొలగించాలని భావిస్తోంది. కేంద్ర పారామిలిటరీ దళాల్లో అతి తక్కువ ఆరోగ్య ఫిట్‌నెస్ కలిగిన జవాన్లను గుర్తించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.

శారీరకంగా దారుఢ్యం లేనివారిని ‘షేప్‌-5’గా పిలుస్తుంటారు. ఈ రెండు భద్రతాదళాల నుంచి షేప్‌-5 జవాన్లను ముందే రిటైర్‌ చేయించి పంపించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు సమాచారం. ఈ రెండు దళాలు హోం శాఖ పరిధిలోకి వస్తాయి. రెండింటిలోనూ 40-45 ఏళ్ల వయసు మధ్య ఉన్న కొన్ని వందల మంది ఫిట్‌నెస్‌ కోల్పోయారని అధికారులు గుర్తించారు.

‘‘వీరిలో చాలామంది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో, కశ్మీర్‌లోని ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ఇలాంటి కీలకమైన చోట్ల శారీరకంగా దృఢంగా లేనివారిని ఉంచటం మంచిది కాదు’’ అని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. గతంలో ఇలా దారుఢ్యంలేనివారిని పోరాట ప్రాంతాల నుంచి తొలగించి, అడ్మినిస్ట్రేషన్‌ పనులు అప్పగించేవారు. కానీ, ఈసారి వారికి సర్వీసు నిబంధనల ప్రకారం అన్ని సదుపాయాలతో ముందస్తు రిటైర్మెంట్‌ ఇవ్వాలని భావిస్తున్నారు.

పారామిలిటరీ దళాలలో వైకల్యాలు, నిబంధనల ప్రకారం, మూడు వర్గాల క్రింద వర్గీకరించారు. ఉగ్రవాదులు, మావోయిస్టు ప్రాంతాల్లో పని చేసేవారు, అనారోగ్యం, ప్రమాదం ద్వారా వికలాంగులు, మానసిక వ్యాధుల కారణంగా అనర్హులుగా గుర్తిస్తారు. ఇతరత్రా పోరాటల్లో గాయాల కారణంగా వైకల్యం. మాదకద్రవ్యాల, మద్యపాన వ్యసనపరులను గుర్తించడం. ఇలాంటి వారిని ఓ జాబితా తయారు చేయాలని కేంద్రం ఆదేశించింది. మొదటి రెండు వర్గాలకు చెందిన జవాన్లు వారి సామర్థ్యాన్ని, ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసిన తరువాత బలవంతంగా పునరావాసం కల్పిస్తారు. కానీ మానసికంగా అనర్హులుగా ప్రకటించిన వారిని తొలగించాలని కేంద్రం భావిస్తోంది.

Read Also…  PM’s YUVA: యువ రచయితలకు ప్రోత్సాహం.. సరికొత్త పథకాన్ని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ..