Girl Died: ఘోరం.. తాగునీరు దొరక్క చిన్నారి మృతి.. స్పృహ తప్పి పడిపోయిన వృద్ధురాలు.. కంటతడి పెట్టిస్తున్న ఘటన
Child lying Dead: రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. తాగునీరు దొరకక అయిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమెతోపాటు వృద్ధురాలు కూడా స్పృహ తప్పి పడిపోయింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం
Child lying Dead: రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. తాగునీరు దొరకక అయిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమెతోపాటు వృద్ధురాలు కూడా స్పృహ తప్పి పడిపోయింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాష్ట్రంలోని జలోరే జిల్లా రాణివాడలో ఈ ఘటన జరిగింది. రాయ్‌పుర్ నుంచి రాణివాడా తాలూకాలోని రోడా గ్రామానికి సుకి దేవి భిల్ (60) ఐదేళ్ల చిన్నారితో కలిసి బయలుదేరింది. పది కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సోదరిని కలిసేందుకు ఆమె ఉదయాన్నే బయలు దేరింది. కాగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో మార్గమధ్యంలో తాగడానికి నీరు కూడా లేకపోవడం వల్ల ఉన్నట్టుండి ఇద్దరూ కుప్పకూలిపోయారు. కొద్దిసేపటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని జలోరే జిల్లా అధికారులు తెలిపారు. వెంటనే వృద్ధురాలని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
ఇసుకలో చిన్నారి, వృద్ధురాలు పడి ఉండటాన్ని చూసిన స్థానిక గొర్రెల కాపరి.. వెంటనే గ్రామ సర్పంచ్‌కు సమాచారమిచ్చాడు. ఆయన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా అధికారులు.. పరిశీలించి బాలిక డీహైడ్రేషన్‌తో చనిపోయినట్లు వెల్లడించారు. వృద్ధురాలు కూడా డీహైడ్రేషన్ తో బాధపడుతుందని పేర్కొన్నారు. వెంట నీరు తీసుకోకపోవడం వల్ల ఈ సంఘటన జరిగిందని స్థానిక ఇన్స్పెక్టర్ పద్మారామ్ రాణా పేర్కొన్నారు. అయితే.. బాలిక తల్లి రెండో పెళ్లి చేసుకోని కుటుంబాన్ని విచిపెట్టి పోవడంతో.. బాలిక వృద్ధురాలి దగ్గరే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఇద్దరు కూడా ఇరుగుపొరుగు వారు ఇచ్చిన ఆహార పదార్థాలతో జీవనం సాగిస్తున్నారని స్థానికులు వెల్లడించారు. కాగా.. ప్రస్తుతం చిన్నారి మృతదేహం పక్కన వృద్ధురాలు కూర్చున్న ఫొటో పలువురిని కంటతడి పెట్టిస్తోంది.
ఇదిలాఉంటే.. ఈ సంఘటనపై కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్.. రాజస్థాన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీరు కారణంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. కేంద్ర వనరులను, పథకాలను వినియోగించుకోవడం రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.
Also Read: