ఆదిలాబాద్ రంజాన్లకు భలే గిరాకీ.. నీటిని చల్లబరచడమే కాదు.. ఇంకా చాలా విషయాల్లో బెటర్‌.. ఏంటో తెలుసుకోండి..

Adilabad Ranjan Pots : ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఆదిలాబాద్‌ రంజాన్‌లు, కుండలు ఎక్కడ అమ్ముతున్నారో తెలుసుకొని మరీ విక్రయిస్తాం.. ఎందుకంటే రంజాన్ నీళ్లు తాగితే ఆ మజాయే వేరు.. పేదవాడి ఫ్రిజ్‌గా

ఆదిలాబాద్ రంజాన్లకు భలే గిరాకీ..  నీటిని చల్లబరచడమే కాదు.. ఇంకా చాలా విషయాల్లో బెటర్‌.. ఏంటో తెలుసుకోండి..
Pots
Follow us
uppula Raju

|

Updated on: Apr 02, 2021 | 3:27 PM

Adilabad Ranjan Pots : ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఆదిలాబాద్‌ రంజాన్‌లు, కుండలు ఎక్కడ అమ్ముతున్నారో తెలుసుకొని మరీ విక్రయిస్తాం.. ఎందుకంటే రంజాన్ నీళ్లు తాగితే ఆ మజాయే వేరు.. పేదవాడి ఫ్రిజ్‌గా చెప్పుకునే వీటికి సౌత్ ఇండియాలోనే మంచి డిమాండ్ ఉంది. నీటిని చల్లగా ఉంచడంతో పాటు చూడటానికి అందంగా ఉండడం వల్ల వీటికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇందులో నీళ్లు చాలా తొందరగా చల్లబడతాయి. అంతేకాకుండా మట్టితో తయారు చేస్తారు కనుక ఇందులోని నీటిలో మంచి ఔషధ గుణాలు ఉంటాయి. సహజ సిద్ధంగా తయారు చేస్తారు కనుక ఆరోగ్యానికి చాలా మంచివని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ తయారైన రంజన్లు తెలుగు రాష్ట్రలతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర లోని పలు ప్రాంతాలకు దిగుమతి చేసుకుంటారు. వీటి తయారీ గురించి, వాటిని వాడుతున్న చాలా మందికి తెలియకపోవచ్చు. ఇక్కడి కుమ్మరి వారు రంజన్ల తయారీలో ఉపయోగించే మట్టి సేకరణ నుంచే ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.

వీటి తయారీలో నాణ్యత కలిగిన బంకమట్టిని సేకరించి పొడిగా కలుపుతారు. నీళ్లతో తడిపిన మిశ్రమాన్ని అలాగే కొద్ది రోజుల పాటు ఉంచుతారు. తర్వాత గుర్రపు లద్ది కలిపి రంజన్లను చేతితో తయారు చేసి ఆరబెడతారు. అలా ఓ క్రమ పద్దతిలో పేర్చి మంటల్లో కాలుస్తారు. కాల్చిన తర్వాత ఏర్పడే రంధ్రాల నుంచి నీరు బయటకు రానప్పటికీ వాటి గుండ గాలి తగలడంతోనే అతి తక్కువ సమయంలో వాటిలోని నీరు చల్లగా ఔతుంది. వేసవి వచ్చిందంటే రంజన్ ను కొనుక్కొని చల్లటి నీటు తాగుతారు. దీంతో ఇవి పేదోడి ఫ్రిజ్ గా ప్రసిద్ధి చెందింది. విడిగా 80 రూపాయల నుంచి 300 రూపాయల వరకు లభించే ఈ రంజన్లకు ఎండాకాలంలో మాత్రం బాగా గిరాకీ ఉంటుంది. సీజన్ లో తప్పించి ఏడాది పొడవునా తమకు మరో ఉపాధి లేక బ్రతుకు భారంగా మారిందని కుమ్మరులు వాపోతున్నారు. ప్రభుత్వం రంజన్ల తయారిని కుటీర పరిశ్రమగా గుర్తించి ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.

Assembly Elections 2021: కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ.. ప్రియాంక గాంధీ పర్యటనలన్నీ రద్దు.. కారణమేంటంటే..

దళపతి విజయ్‏తో ఉన్న ఈ హీరోయిన్‏ను గుర్తు పట్టారా ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..