AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Food For Good Sleep: మీకూ రాత్రిళ్లు నిద్రపట్టడం లేదా? వీటిని తిన్నారంటే చిటికెలో కునుకుతీస్తారు..

గటు మనిషికి 7 నుంచి 8 గంటలు నిద్ర అవసరం. సరిపడా నిద్ర లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి మంచి ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా ముఖ్యం. కానీ కొంతమంది ఒత్తిడి ఇతర కారణాల వల్ల సరిగ్గా నిద్రపోరు. ముఖ్యంగా కొంతమంది తెల్లవార్లు నిద్ర అస్సలు రాదని చెబుతుంటారు..

Food For Good Sleep: మీకూ రాత్రిళ్లు నిద్రపట్టడం లేదా? వీటిని తిన్నారంటే చిటికెలో కునుకుతీస్తారు..
దిండు కవర్లు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి. కాటన్‌తో తయారు చేసిన దిండు గుడ్డ ఉండాలి. దిండు రంగు తేలికగా ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. బాగా నిద్రపోవడానికి తల దిండు తక్కువ ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి.
Srilakshmi C
|

Updated on: May 26, 2025 | 7:53 PM

Share

మంచి పోషకాలు కలిగిన ఆహారం శారీరక, మానసిక ఆరోగ్యానికే కాదు మంచి నిద్ర కూడా చాలా అవసరం. సగటు మనిషికి 7 నుంచి 8 గంటలు నిద్ర అవసరం. సరిపడా నిద్ర లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి మంచి ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా ముఖ్యం. కానీ కొంతమంది ఒత్తిడి ఇతర కారణాల వల్ల సరిగ్గా నిద్రపోరు. ముఖ్యంగా కొంతమంది తెల్లవార్లు నిద్ర అస్సలు రాదని చెబుతుంటారు. మీరు కూడా రాత్రిళ్లు బాగా నిద్రపోవాలని ఆశిస్తున్నారా? అయితే మీ ఆహారంలో ఈ కింది పోషకాలను చేర్చుకోండి.. చిటికెలో నిద్రపోతారు..

బాదం

బాదం నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బాదంపప్పులో మెలటోనిన్ ఉంటుంది. మెలటోనిన్ మీ నిద్ర విధానాలను మెరుగుపరుస్తుంది. ఇది మీకు మంచి నిద్ర పొందడానికి సహాయపడుతుంది.

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ నిద్రను ప్రోత్సహించే ఉత్తమ స్నాక్స్‌లో ఒకటి. డార్క్ చాక్లెట్‌లో సెరోటోనిన్ కూడా ఉంటుంది. అది మనసును ప్రశాంతపరుస్తుంది. ఇది మీకు మంచి నిద్ర పొందడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

కివి పండు

కివి పండులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా పొటాషియం, ఫోలేట్, విటమిన్లు సి, ఇ మంచి నిద్రను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

చెర్రీస్

చెర్రీస్ లో మెలటోనిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది నిద్రను ప్రోత్సహించే హార్మోన్. అందువల్ల ఈ పండు తినడం లేదా దాని జ్యూస్ తాగడం వల్ల రాత్రి బాగా నిద్ర వస్తుంది.

గుమ్మడికాయ గింజలు

గుమ్మడికాయ గింజల్లోని ట్రిప్టోఫాన్, మెగ్నీషియం, జింక్ మెలటోనిన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి. మంచి నిద్రను ప్రోత్సహిస్తాయి.

అరటిపండు

మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉండే అరటిపండ్లు రాత్రిపూట తినడం వల్ల కూడా బాగా నిద్ర పడుతుంది. ఇది కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి కూడా సహాయపడుతుంది.

వేడి పాలు

పాలలో ట్రిప్టోఫాన్, మెలటోనిన్ ఉంటాయి. ఇవి నిద్రను మెరుగుపరచడంలో సహాయపడతాయి. కాబట్టి, ప్రతి రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు వేడి పాలు త్రాగాలి.

గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి