Lungs Care: ఈ చిట్కాలు పాటిస్తే మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి..
శరీర భాగాల్లో ఊపిరితిత్తులు కూడా ఒకటి. ఊపిరి తిత్తుల ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ఊపిరి తిత్తులు ఆరోగ్యంగా ఉంటేనే.. ఇతర భాగాలు కూడా హెల్దీగా ఉంటాయి. ప్రస్తుతం ఇప్పుడు పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా.. ఊపిరి తిత్తులు ఎక్కువగా పాడవుతున్నాయి. రోజు రోజుకూ బైక్స్, కార్ల వాడకం ఎక్కువ అవడంతో.. వాయు కాలుష్యం ఎక్కువ అవుతుంది. దీంతో పీల్చుకునే గాలిలో నాణ్యత అనేది తగ్గుతుంది. ఊపిరి తిత్తులను సరిగా చూసుకుంటేనే..
శరీర భాగాల్లో ఊపిరితిత్తులు కూడా ఒకటి. ఊపిరి తిత్తుల ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ఊపిరి తిత్తులు ఆరోగ్యంగా ఉంటేనే.. ఇతర భాగాలు కూడా హెల్దీగా ఉంటాయి. ప్రస్తుతం ఇప్పుడు పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా.. ఊపిరి తిత్తులు ఎక్కువగా పాడవుతున్నాయి. రోజు రోజుకూ బైక్స్, కార్ల వాడకం ఎక్కువ అవడంతో.. వాయు కాలుష్యం ఎక్కువ అవుతుంది. దీంతో పీల్చుకునే గాలిలో నాణ్యత అనేది తగ్గుతుంది. ఊపిరి తిత్తులను సరిగా చూసుకుంటేనే.. ఆరోగ్యంగా ఉంటారు. మరి ఈ వాయు కాలుష్యం నుంచి ఊపిరి తిత్తులను ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఇంట్లోనే వ్యాయామం చేయడానికి ట్రై చేయండి:
చాలా మంది వ్యాయామాలు బయట చేయడానికి ఇష్ట పడుతూ ఉంటారు. నలుగురితో సరదగా కలిసి వ్యాయామం చేస్తూ ఉంటారు. ఇది మంచి విషయమే అయినా.. దీని వల్ల బయట గాలిని ఎక్కువగా పీల్చుకోవాల్సి వస్తుంది. దీంతో కలుషితమైన గాలి లోపలకు వెళ్తుంది. ఉదయాన్నే పిల్లలకు బయటుకు తీసుకెళ్లకుండా ఉండటమే మంచిది. దీని వల్ల శ్వాస సమస్యలు తలెత్త వచ్చు. ఒక వేళ బయటకు వెళ్తే.. సరైన భద్రతా చర్యలు తీసుకోవడం ముఖ్యం.
మాస్క్ ధరించాలి:
సమయం ఏదైనా.. ఎక్కడైనా సరే బయటకు వెళ్లేముందు ఖచ్చితంగా మీరు మాస్క్ అనేది ధరించాలి. మీ ముక్కును మాస్క్‌తో కప్పుకోవడం వల్ల వాయు కాలుష్యం నుంచి తప్పించుకోవచ్చు. చిన్న పాటి మాస్క్‌లే మిమ్మల్ని వాయు కాలుష్యం నుంచి బయట పడేస్తాయి.
బెల్లం తినండి:
బెల్లం అనేది ఎంతో పోషకాలు నిండిన పదార్థం. మీరు బెల్లాన్ని ప్రతి రోజూ మీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బెల్లం తినడం వల్ల.. మీ శరంలోనే పేరుకుపోయిన మలినాలను, టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. అంతే కాకుండా శ్వాస కోశ సమస్యల లక్షణాలను కూడా నయం చేస్తుంది.
యూకలిప్టస్ ఆయిల్:
యూకలిప్టస్ ఆయిల్ కూడా మీ శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపేందుకు బాగా హెల్ప్ చేస్తుంది. అప్పుడప్పుడూ ఆవిరి పట్టడం చాలా అవసరం. ఆవిరి పట్టేటప్పుడు.. అందులో కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేడయం చాలా మంచిది. ఇలా ఆవిరి పట్టడం వల్ల శ్వాస మార్గాల్లో ఏమైనా అడ్డంకులు ఉంటే తొలగుతాయి. అంతే కాకుండా ఇంట్లో మొక్కలు పెంచుకోవడం వల్ల కూడా వాయు కాలుష్యం నుంచి ఊపిరితిత్తులను కాపాడుకోవచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)