Pregnancy Time: ప్రెగ్నెన్సీ సమయంలో మీ భార్యను ఇలా సంతోషంగా ఉంచండి.. ఇది తల్లితో పాటు బిడ్డకూ మేలు చేస్తుంది.

Pregnancy Time: ప్రతీ మహిళ జీవితంలో తల్లి కావడం అనేది ఎంతో మధురమైన జ్ఞాపకం. తల్లిగా మారబోయే క్షణాలను మహిళలు ఎంతో ఆస్వాదిస్తుంటారు. తన ప్రతిరూపాన్ని త్వరలోనే చూడబోతున్నమాన్న..

Pregnancy Time: ప్రెగ్నెన్సీ సమయంలో మీ భార్యను ఇలా సంతోషంగా ఉంచండి.. ఇది తల్లితో పాటు బిడ్డకూ మేలు చేస్తుంది.
Make Wife Happy
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 27, 2021 | 9:04 AM

Pregnancy Time: ప్రతీ మహిళ జీవితంలో తల్లి కావడం అనేది ఎంతో మధురమైన జ్ఞాపకం. తల్లిగా మారబోయే క్షణాలను మహిళలు ఎంతో ఆస్వాదిస్తుంటారు. తన ప్రతిరూపాన్ని త్వరలోనే చూడబోతున్నమాన్న సంతోషంలో ఉంటారు. ఇందులో భాగంగానే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని తల్లులు చేయని పనంటూ ఉండదు. ఎప్పుడూ అలవాటు లేని ఆహార పదార్థాలను కూడా అలవాటు చేసుకుంటారు. ఇష్టమైన జంక్‌ ఫుడ్‌ను కూడా త్యాగం చేస్తారు. అయితే తల్లుల మానసిక ఆరోగ్యం కూడా పుట్టబోయే బిడ్డపై పడుతుందని మీకు తెలుసా.? మరీ ముఖ్యంగా భర్తలు ఇది మీ కోసమే. ఎందుకంటే మీ భార్య సంతోషం మీ చేతుల్లో కూడా ఉంటుందని కాబట్టి. ఇంతకీ భార్య గర్భిణీగా ఉన్న సమయంలో భర్తలు ఎలాంటి చర్యల ద్వారా తమ అర్ధాంగిని సంతోషం ఉంచొచ్చన్న విషయాలు ఇప్పుడు చూద్దాం..

అర్థం చేసుకోండి..

గర్భిణీగా ఉన్న సమయంలో మహిళల భావోద్వేగాలు మారుతూ ఉంటాయి. అప్పుడే చికాకు పడుతుంటారు, కోపం తెచ్చుకుంటుంటారు. కాబట్టి వీటన్నింటినీ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత భర్తపై ఉంటుంది. మీ భార్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా వారితో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా ఇబ్బందికి గురిచేసేలా మాట్లాడకూడదు.

మ్యాజిక్‌ చేయండి..

మీ భార్యను సంతోషంగా ఉంచేందుకు మీ ట్యాలెంట్‌తో మ్యాజిక్‌ చేయండి. అంటే మీకు రాయడం వస్తే మీ భార్య గురించి ఓ మంచి కవిత రాసి ఆమెకు వినిపించండి. అంతేకాకుండా ఓ మంచి పాటను కూడా పాడొచ్చు. అలాగే మీ పెళ్లి నాటి మధుర జ్ఞాపకాలను వారితో షేర్‌ చేసుకోండి. ఇవి వారికి మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి.

ప్రత్యేకంగా చూసుకోండి..

గర్భిణీలుగా ఉన్న సమయంలో మహిళలను ప్రత్యేకంగా చూసుకోవాలి. ఇది కూడా వారికి సంతోషానిస్తుంది. అప్పుడప్పుడు మీ భార్యకు టీ పెట్టించడమో, ఏదైనా స్నాక్‌ చేసివ్వడమో చేయండి. ఇవి మీరు మీ భార్యను ఎంతలా ప్రేమిస్తున్నారో వారికి తెలియజేస్తాయి. అంతేకాకుండా గర్భిణీలుగా ఉన్న సమయంలో వారికి కొన్ని కోరికలు ఉంటాయి. వాటిని నెరవేర్చడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా మహిళలు ఈ సమయంలో రకరకాల ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడుతుంటారు. వారికి అవి అందేలా చూసుకోవాల్సిన బాధ్యత భర్తపై ఉంటుంది.

భార్య చెప్పేది వినండి..

ప్రతీ మనిషి ఎదుటి వ్యక్తి నుంచి గౌరవాన్ని కోరుకుంటారు. మనం చెబుతోన్న విషయాన్ని ఎదుటి వారు వినకపోతే చిరాకుగా ఉంటుంది. మరీ ముఖ్యంగా గర్భిణీగా ఉన్న సమయంలో భార్యలు.. భర్తలతో కొన్ని విషయాలను షేర్‌ చేసుకుంటారు. వాటిని ఓపికతో వినాలి, కానీ కసురుకోకూడదు. ఇలాంటి చిన్న చిన్న పద్ధతులు పాటిస్తే మీ భార్య మానసిక ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆటోమెటిగ్‌ దీని ప్రభావం పుట్టబోయే మీ చిన్నరిపై పడుతుంది.

Also Read: Childhood-Rare Photo: అమ్మ ఒడిలో ఉన్న ఈ హైదరాబాదీ చిన్నారి.. జాతీయ ఉత్తమ నటి.. ఎవరో గుర్తుపట్టారా..

DISHA SOS కాల్‌తో రెండు నిండు ప్రాణాలను కాపాడిన విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీసులు.

Find Snake: మీ కంటి పనితీరుకు ఇదొక పరీక్ష… ఈ ఫొటోలో పాము దాగి ఉంది. కనిపించించలేదా? అయితే స్టోరీలోకి వెళ్లండి.