DISHA SOS కాల్‌తో రెండు నిండు ప్రాణాలను కాపాడిన విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీసులు.
మహిళలకు మరింత రక్షణ కల్పించేందుకు... ప్రమాదంలో ఉన్న మహిళలను కాపాడేందుకు దిశా యాప్‌ను రూపొందించింది ప్రభుత్వం...
DISHA SOS: మహిళలకు మరింత రక్షణ కల్పించేందుకు… ప్రమాదంలో ఉన్న మహిళలను కాపాడేందుకు దిశా యాప్‌ను రూపొందించింది ప్రభుత్వం. దిశా యాప్ ద్వారా చాల మంది తక్షణ రక్షణ అందుతుంది. ఇదిలా ఉంటే ప్రేమ పేరుతో నమ్ముకొని వచ్చిన అఖిల్ అనే అబ్బాయి తనను మోసం చేశాడని. దాంతో సమాజంలో ఎదురయ్యే అవమానాలను భరించే ధైర్యం లేక గత్యంతరం లేని పరిస్థితిలో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తన కుమార్తె చెప్పిందని.. ఆమెను కాపాడాలని కోరుతూ అర్థరాత్రి సుమారు ఒంటిగంట సమయంలో ఓ మహిళ మంగళగిరిలో DISHA SOSకి సందేశాన్ని అందించింది.
DISHA SOS కు పంపిన సమాచారం నెంబరు ఆధారంగా మహిళ ఉన్న ప్రదేశాన్నిగుర్తించారు దిశ కంట్రోల్ రూం సిబ్బంది. ఆమె విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ సమీపంలో ఉందని కనుక్కున్నారు. దాంతో హుటాహుటిన విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. సమీపంలో విధులు నిర్వహిస్తున్న పెట్రోలింగ్ పోలీసులు సకాలంలో స్పందించి కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే మహిళ ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. అప్పటికే గుర్తుతెలియని విషం సేవించి అపస్మారక స్థితిలో పడి ఉంది. మహిళను గుర్తించిన పోలీసులు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రాణాలను నిలబెట్టారు. అంతేకాకుండా మహిళతో పాటు ఉన్న ఐదు సంవత్సరాల బాలికను చేరదీసిన అజిత్ సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :