AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వంకాయ, బీరకాయ కేజీ అర్ధరూపాయి.. టమాట 2 రూపాయలు.. కన్నీరు పెడుతున్న రైతులు

ప్రతీఏటా శ్రావణమాసం వచ్చిందంటే కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతాయి. ఆ సమయంలో కూరగాయలకు ఫుల్‌ డిమాండ్‌ ఉండటం వల్ల రైతులకు....

Andhra Pradesh: వంకాయ, బీరకాయ కేజీ అర్ధరూపాయి.. టమాట 2 రూపాయలు.. కన్నీరు పెడుతున్న రైతులు
Veg Farmers Trobles
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 27, 2021 | 9:19 AM

ప్రతీఏటా శ్రావణమాసం వచ్చిందంటే కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతాయి. ఆ సమయంలో కూరగాయలకు ఫుల్‌ డిమాండ్‌ ఉండటం వల్ల రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. కానీ.. కర్నూలు జిల్లా ఆలూరు మార్కెట్‌లో కూరగాయల ధరలు ఊహించని విధంగా పతనం అయ్యాయి.  వంకాయ, బీరకాయ ధరలు అర్ధరూపాయికి పడిపోయాయి. కిలో టమోటా రెండు రూపాయలు మాత్రమే పలుకుతుంది. ఇక పచ్చి మిర్చిని కూడా కిలో రూపాయికి ఇస్తావా, రెండు రూపాయలకు ఇస్తావా అని అడుతున్నారు వ్యాపారులు. దీంతో వంకాయలను రోడ్డుపై పడేసి రైతులు నిరసన వ్యక్తం చేశారు. ధరలు లేక లబోదిబోమంటున్నారు రైతులు. ధరలు పలుకుతాయనే ఉద్దేశంతో ఆలూరు వ్యవసాయ సబ్ డివిజన్ లో రైతులు భారీ ఎత్తున కూరగాయలు సాగు చేశారు.

గతంలో ఎన్నడూలేని విధంగా కూరగాయల ధరలు ఒక్కసారిగా కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. దీంతో పండించిన కూరగాయలు ఏం చేయాలో అర్ధంకాని పరిస్థితి రైతులకు ఎదురవుతోంది. ప్రస్తుతం వర్షాలు దండిగా పడుతున్నాయి. దీంతో కూరగాయలు దిగుబడి అధికంగా ఉంటోంది. దీంతో మార్కెట్‌కు కుప్పలుతెప్పలుగా కాయగూరలు వచ్చి పడుతున్నాయి. దిగుబడి అధికం కావడంతో వాటి ధరలు ఎవరూ ఊహించని రీతిలో తగ్గిపోయాయి. దీంతో కనీసం కొందరికి మార్కెట్‌కు తీసుకువచ్చిన వాహనం కిరాయి డబ్బులు కూడా రావడం లేదు. మార్కెట్‌కు వెళ్లాక  కూడా రైతులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. తాము తెచ్చిన పంటను తీసుకోమంటూ దళారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఎవరైనా తీసుకున్నా వారు అడిగిన రేటుకే ఇవ్వాల్సి వస్తోంది.  ధరల నిలకడ లేకపోవడంతో పలు ప్రాంతాల్లో కూరగాయలనే పండించి వీటిపైనే ఆధారపడి బతుకుతున్న రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తోంది.

Also Read: Ginger Farmers: కిలో అల్లం రూ.20నే.. చేసేదేం లేక పొలాల్లోనే పంటను దున్నేస్తున్న రైతులు

 బార్ అండ్ రెస్టారెంట్‌లో కుళ్లిపోయిన ఆహార పదార్థాలు.. మాములుగా చూస్తే వాంతి వస్తుంది.. వాటినే వేడివేడిగా..