Ginger Farmers: కిలో అల్లం రూ.20నే.. చేసేదేం లేక పొలాల్లోనే పంటను దున్నేస్తున్న రైతులు

గత కొద్దిరోజులుగా గిట్టుబాటు ధరలు లేక అల్లం పండించే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంతకుముందు అల్లం పంట పండించే...

Ginger Farmers: కిలో అల్లం రూ.20నే.. చేసేదేం లేక పొలాల్లోనే పంటను దున్నేస్తున్న రైతులు
Ginger Farmers
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 27, 2021 | 8:03 AM

గత కొద్దిరోజులుగా గిట్టుబాటు ధరలు లేక అల్లం పండించే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంతకుముందు అల్లం పంట పండించే రైతుకు డబ్బులు బాగా వచ్చేవి. కానీ ఇప్పుడా పరిస్థితులు లేవు. ప్రస్తుతం మార్కెట్ లో కిలో అల్లం ధర కేవలం 20 రూపాయలు పలుకుతుండడంతో.. చేసేది లేక లక్షల రూపాయలు ఖర్చు చేసి.. సాగు చేసిన అల్లం పంటను పొలాల్లోనే దున్నేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ ప్రాంతంలో అల్లం సాగు ఎక్కువ చేస్తారు రైతులు. పండించిన అల్లం పంటకు.. కనీస పెట్టుబడి కూడా రాకపోవడంతో పొలంలోనే పంటను దున్నేస్తున్నారు రైతులు. అల్లంకు మార్కెట్‌ లో సరైన ధర లేకపోవడం వల్ల అల్లం పంట వేసిన రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. లాభాలు వస్తాయని ఆశించి అప్పులు తెచ్చీ.. మరి సాగు చేసిన జహీరాబాద్‌ డివిజన్‌లోని రైతులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.

అల్లం సాగుకు విత్తనంతో పాటు మందులు, కలుపుతీత, ఎరువులు తదితర వాటి కోసం ఎకరానికి లక్ష రూపాయల వరకు రైతులు ఖర్చు చేశారు. ప్రజెంట్ మార్కెట్‌లో మాత్రం.. అల్లం ధర కేవలం కిలో 20 రూపాయాలకు పడిపోయింది. దీంతో సాగు, రవాణా ఖర్చులు అన్ని కలిపినా పెట్టుబడి కూడా వచ్చేలా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. జహీరాబాద్‌ డివిజన్‌లో కోహీర్‌, జహీరాబాద్‌, మొగుడంపల్లి, న్యాల్‌కల్‌ మండలాల్లో అధికంగా అల్లం పంటను సాగు చేస్తారు. ఇతర పంటల కంటే అల్లానికి మంచి ధర ఉంటుందనే ఆశతో అప్పులు చేసి మరీ సాగుచేసారు. చివరికీ మద్దతు ధర లేకపోవడంతో.. లబోదిబోమంటున్నారు రైతులు. అల్లం పంటకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలని జహీరాబాద్ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం చిరుధాన్యాల పంటలకు ఎలాగైతే మద్దతు ధర ప్రకటిస్తుందో.. ఉద్యానవనశాఖ పరిధిలోకి వచ్చే అల్లం పంటకు కూడా నిర్ధిష్టమైన ధరలను ప్రకటిస్తే రైతులకు లాభం చేకూరే అవకాశం ఉందంటున్నారు.

Also Read: బార్ అండ్ రెస్టారెంట్‌లో కుళ్లిపోయిన ఆహార పదార్థాలు.. మాములుగా చూస్తే వాంతి వస్తుంది.. వాటినే వేడివేడిగా..

 ఈరోజు ఏ రాశివారికి వ్యాపారం, ఉద్యోగంలో కలిసి వస్తుంది.. ఏ రాశి వారి కుటుంబంలో సంతోషం ఉంటుందంటే

ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే