Horoscope Today: ఈరోజు ఏ రాశివారికి వ్యాపారం, ఉద్యోగంలో కలిసి వస్తుంది.. ఏ రాశి వారి కుటుంబంలో సంతోషం ఉంటుందంటే

Horoscope Today(August 27th 2021): ఏ పని చేయాలన్నా మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు.. జాతకాలను విశ్వసించేవారు చాలామంది ఉంటారు. ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది..

Horoscope Today: ఈరోజు ఏ రాశివారికి వ్యాపారం, ఉద్యోగంలో కలిసి వస్తుంది..  ఏ రాశి వారి కుటుంబంలో సంతోషం ఉంటుందంటే
Horoscope
Follow us
Surya Kala

|

Updated on: Aug 27, 2021 | 7:09 AM

Horoscope Today(August 27th 2021): ఏ పని చేయాలన్నా మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు.. జాతకాలను విశ్వసించేవారు చాలామంది ఉంటారు. ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం ఆగస్ట్ 27వ తేదీ శనివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. స్నేహితులతో విభేదాలు, అధిక శ్రమ , అనారోగ్యంపాలయ్యే అవకాశం ఉంది. వ్యాపారాలు మందగిస్తాయి, ఉద్యోగంలో చికాకులు ఏర్పడతాయి. దీంతో నిర్ణయాలను తీసుకోవడంలో ఆచితూచి అడుగువేయాల్సి ఉంది.

వృషభ రాశి: ఈ రాశివారికి విలువైన సమాచారం అందుతుంది. సన్నిహితుల చేయూతతో చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినప్పటికీ సకాలంలో పూర్తిచేస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అదనపు ఆదాయం. వ్యాపార లావాదేవీలలో లాభాలు. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

మిధున రాశి: ఈరాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. . ప్రత్యర్థుల నుంచి సైతం సాయం అందుతుంది.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధువులతో విరోధాలు. కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగాలలో మార్పులు వ్యాపారం నిరుత్సాహంగా సాగుతుంది.

సింహ రాశి: ఈరోజు కుటుంబంలో వివాదాలు ఏర్పడతాయి. ఆకస్మికంగా దూరప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఆధ్యాత్మికతపై ద్రుష్టి పెడితే.. సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది

కన్య రాశి: ఈ రాశివారికి పనులకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి.సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతుంది.

తులా రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనుల్లో అవరోధాలుంటాయి. కుటుంబంతో వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో స్వల్ప ధన నష్టాలుంటాయి. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. వ్యవహారాల్లో చికాకులు. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశి వారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. అదనపు ఆదాయంపొందే అవకాశం ఉంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు పెడతారు. ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులున్నాయి.

ధనుస్సు రాశి: ఈరోజు ఈ రాశివారికి మిశ్రమఫలితాలుంటాయి. మిత్రులతో విబేధాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఏర్పడి ఆదాయం తగ్గుతుంది. ఉద్యోగాలలో కొన్ని చిక్కులు ఏర్పడి చికాకు పెడతాయి.

మకర రాశి: ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. కొత్త వ్యాపారాలలో మరింత ఉత్సాహం. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది.

కుంభ రాశి: ఈరాశి వారు చేపట్టినటువంటి పనులు విశేషంగా పూర్తి చేసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉంటారు. వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత కలుగుతుంది. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

మీన రాశి: ఈ రాశివారికి ఈరోజు పరిస్థితులు అనుకూలించవు. రాబడి కంటే ఖర్చులు అధికం. .. సన్నిహితులతో విభేదాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు నిదానంగా జరుగుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం దక్కదు.

Also Read: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే

మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్