Telangana: బార్ అండ్ రెస్టారెంట్‌లో కుళ్లిపోయిన ఆహార పదార్థాలు.. మాములుగా చూస్తే వాంతి వస్తుంది.. వాటినే వేడివేడిగా..

కుళ్లిపోయిన ఆహార పదార్థాలు.. అపరిశుభ్రమైన కిచెన్‌.. రెస్టారెంట్లలో ఇటీవల చాలా ప్రాంతాల్లో ఇలాంటి సీన్‌ కనిపిస్తోంది. అయితే బీ కేర్‌ఫుల్‌ అని ఫుడ్‌ సేఫ్టీ అధికారులు...

Telangana: బార్ అండ్ రెస్టారెంట్‌లో కుళ్లిపోయిన ఆహార పదార్థాలు.. మాములుగా చూస్తే వాంతి వస్తుంది.. వాటినే వేడివేడిగా..
A Representative Image
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 27, 2021 | 7:48 AM

కుళ్లిపోయిన ఆహార పదార్థాలు.. అపరిశుభ్రమైన కిచెన్‌.. చాలా ప్రాంతాలలోని రెస్టారెంట్లలో ఇటీవల ఇలాంటి సీన్‌ కనిపిస్తోంది. అయితే బీ కేర్‌ఫుల్‌ అని ఫుడ్‌ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి 1టౌన్, 2టౌన్ సర్కిల్ పోలీసులు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు సంయుక్తంగా హోటల్స్, దాబాల్లో తనిఖీలు చేపట్టారు. హోటల్స్, బేకరీలు, స్వీట్ హౌస్‌లు, దాబాలు, బార్ అండ్ రెస్టారెంట్‌లలో తనిఖీలు నిర్వహించారు. SRR బార్ అండ్ రెస్టారెంట్ లోపల ఉన్న వంట గది, ఫ్రిజ్‌లను తనిఖీలు చేశారు. అక్కడ ఉన్న పదార్థాలను పరిశీలించారు. తనిఖీల్లో కుళ్లిపోయిన ఆహార పదార్థాలు,  కిచెన్‌ అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు. ఆహార పదార్థాల తయారీలో యాజమాన్యం నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని ప్రాథమికంగా నిర్ధారించారు. సరైన శానిటేషన్ లేదని కూడా నోట్ చేసుకున్నారు.  కిచెన్‌లోని ఆహార పదార్థాల శాంపిల్ సేకరణ చేసి హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ లాబ్‌కు పంపించారు. రిపోర్ట్స్ ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. హోటల్స్, రెస్టారెంట్స్, దాబాలలో పీపుల్స్ సేఫ్టీ అండ్‌ మెస్సుర్ చట్టం ప్రకారం భద్రత ప్రమాణాలు పాటించాలని, తప్పని సరిగా CC కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, ఫైర్ డిపార్ట్మెంట్ వారి భద్రత ప్రమాణాలు పాటించాలని సూచించారు. హోటల్స్, రెస్టారెంట్స్, దాబాల్లో ఆహార పదార్థాలు నిల్వ ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాలమాడితే అస్సలు ఉపేక్షించేది లేదన్నారు. కాగా ప్రస్తుతం అంతా రెడీమేడ్ యుగం అయిపోయింది. అందులోనూ నాణ్యత ప్రశ్నార్థకమయ్యింది. ఇలాంటి కలుషిత ఆహారం తింటే మున్ముందు మనుషులకు కొత్త జబ్బులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

ఈ తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మంచిర్యాల వేణు, బెల్లంపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ రాజు , రూరల్ ఇన్స్పెక్టర్ జగదీష్, తల్లాగురిజల ఎస్ఐ సమ్మయ్య, నేన్నాల్ ఎస్ఐ రమాకాంత్.. ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Outdated Food

Also Read: వచ్చే నెలలో 7 రోజులు బ్యాంకులు పనిచేయవు..ఎప్పుడెప్పుడో తెలుసుకోండి!

ఈరోజు ఏ రాశివారికి వ్యాపారం, ఉద్యోగంలో కలిసి వస్తుంది.. ఏ రాశి వారి కుటుంబంలో సంతోషం ఉంటుందంటే

మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్