AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Star Air: హైదరాబాద్‌ టు బెంగుళూర్ మధ్య విమాన సర్వీసు ప్రారంభించిన ‘స్టార్‌ఎయిర్’

Star Air: స్టార్ ఎయిర్‌ కంపెనీ ఇప్పుడు హైదరాబాద్‌, బెంగుళూర్‌ మధ్య విమాన ప్రయాణాన్ని ప్రారంభించింది. 26 ఆగస్టు 2021న తన

Star Air: హైదరాబాద్‌ టు బెంగుళూర్ మధ్య విమాన సర్వీసు ప్రారంభించిన 'స్టార్‌ఎయిర్'
Star Air
uppula Raju
|

Updated on: Aug 27, 2021 | 7:16 AM

Share

Star Air: స్టార్ ఎయిర్‌ కంపెనీ ఇప్పుడు హైదరాబాద్‌, బెంగుళూర్‌ మధ్య విమాన ప్రయాణాన్ని ప్రారంభించింది. 26 ఆగస్టు 2021న తన ఎంబ్రాయర్ జెట్‌ను ప్రారంభించింది. ప్రతి మంగళవారం, గురువారం, శనివారం ఈ విమానాలను నిర్వహిస్తారు. మొదటిసారిగా స్టార్ ఎయిర్ తన 50-సీటర్ ఎంబ్రేర్ జెట్‌తో పరిశ్రమలోని ప్రధాన కంపెనీలతో పోటీపడుతుంది. ఈ సందర్భంగా స్టార్ ఎయిర్ ఛైర్మన్ సంజయ్ ఘోడావత్ మాట్లాడుతూ.. ఎంబ్రేర్ జెట్‌లో 31 సీట్ పిచ్, మిడిల్ సీట్లు లేకుండా అదనపు లెగ్‌రూమ్‌ను అందించడం ద్వారా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. హైదరాబాద్, బెంగుళూరు మధ్య కొత్త మార్గాన్ని ప్రారంభించడం మాకు కలిసివస్తుందని అనుకుంటున్నాం. ఈ సర్వీసును ప్రారంభించడం వల్ల మేము గర్వంగా ఫీలవుతున్నాం. ఇది హైదరాబాద్‌లోని ప్రయాణికులకు చాలా ప్రత్యేకమైనదని తెలిపారు.

స్టార్ ఎయిర్ 2021 ఆగస్టు 26 నుంచి జామ్‌నగర్ నుంచి బెంగళూరు, హైదరాబాద్‌కు నేరుగా విమానాలను నడుపుతోంది. స్టార్ ఎయిర్ కంపెనీ అనేది ప్రముఖ భారతీయ వ్యాపార సంస్థ సంజయ్ ఘోదవత్ గ్రూప్ ఏవియేషన్ విభాగం. ఇది విమానయానం, వినియోగదారుల ఉత్పత్తులు, విద్య, శక్తి, రియల్టీ, రిటైల్, టెక్స్‌టైల్స్ వంటి వివిధ వ్యాపారాలను కలిగి ఉన్నది. స్టార్ ఎయిర్ పాన్-ఇండియా స్థాయిలో (చార్టర్) విమాన సేవలను అందిస్తుంది. ప్రయాణీకులకు గొప్ప సౌకర్యాన్ని భద్రతను కల్పిస్తుంది. ప్రయాణీకులకు అత్యంత సరసమైన ధరలో ప్రపంచ స్థాయి విమాన సేవలను అందించి ‘రియల్ ఇండియాకు కనెక్ట్’ చేయడం దీని ప్రయత్నం.

IPL 2021 Phase 2: ఐపీఎల్‌కు దూరమయ్యే ఆటగాళ్లు ఎవరో తెలుసా..? లిస్టులో స్టార్ ప్లేయర్లు కూడా.. పూర్తి జాబితా ఇదిగో..!

Horoscope Today: ఈరోజు ఏ రాశివారికి వ్యాపారం, ఉద్యోగంలో కలిసి వస్తుంది.. ఏ రాశి వారి కుటుంబంలో సంతోషం ఉంటుందంటే

E-Shram Card: అసంఘటిత రంగం కార్మికులకు ఓ వ్యవస్థ ఈ-శ్రామ్ కార్డ్.. ఇది ఎలా ఫిల్ చేయాలి.. స్టెప్ బై స్టెప్ ఇక్కడ తెలుసుకోండి..

Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే