IPL 2021 Phase 2: ఐపీఎల్‌కు దూరమయ్యే ఆటగాళ్లు ఎవరో తెలుసా..? లిస్టులో స్టార్ ప్లేయర్లు కూడా.. పూర్తి జాబితా ఇదిగో..!

IPL 2021: సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ రెండో దశలో చాలామంది అంతర్జాతీయ ఆటగాళ్లు ఆడడం లేదు. అయితే ఇందులో స్టార్ ప్లేయర్లు కూడా ఉండడంతో..

IPL 2021 Phase 2: ఐపీఎల్‌కు దూరమయ్యే ఆటగాళ్లు ఎవరో తెలుసా..? లిస్టులో స్టార్ ప్లేయర్లు కూడా.. పూర్తి జాబితా ఇదిగో..!
Ipl 2021
Follow us
Venkata Chari

|

Updated on: Aug 27, 2021 | 7:13 AM

IPL 2021: భారతదేశంలో కొనసాగుతున్న కోవిడ్ -19 సంక్షోభం నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) (IPL 2021) 14 వ సీజన్ రెండవ దశ పోటీలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో జరగనుంది. ఐపీఎల్ 2021 యొక్క రెండవ దశ సెప్టెంబర్ 19 న డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో మహేంద్ర సింగ్ ధోనీ టీం చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌తోనే రెండవ దశ ప్రారంభం కానుంది.

అక్టోబర్ 15 న ఫైనల్.. క్వాలిఫయర్ 1 అక్టోబర్ 10 న దుబాయ్‌లో జరుగుతుందని, ఎలిమినేటర్ అక్టోబర్ 11 న షార్జాలో జరుగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. రెండో క్వాలిఫయర్ షార్జాలో అక్టోబర్ 13 న జరగనుంది. అలాగే ఫైనల్ అక్టోబర్ 15 న దుబాయ్‌లో జరుగుతుంది.

రెండో దశకు దూరమయ్యే ఆటగాళ్లు.. ఐపీఎల్ 2021 రెండవ దశ త్వరలో ప్రారంభం కానుండటంతో అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా, అనేక అంతర్జాతీయ క్రికెటర్లు ముందస్తు షెడ్యూల్స్ లేదా బిజీగా ఉన్న ప్రపంచ క్రికెట్ షెడ్యూల్ కారణంగా ఐపీఎల్ 2021 రెండవ దశకు అందుబాటులో లేకుండా పోతున్నారు. ఐపీఎల్ రాబోయే రెండవ దశ నుంచి వైదొలిగిన అంతర్జాతీయ ఆటగాళ్ల పూర్తి జాబితా ఇలా ఉంది:

* జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్)

* జోఫ్రా ఆర్చర్ (రాజస్థాన్ రాయల్స్)

* బెన్ స్టోక్స్ (రాజస్థాన్ రాయల్స్)

* పాట్ కమిన్స్ (కోల్‌కతా నైట్ రైడర్స్)

* ఆడమ్ జాంపా (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)

* రిలే మెరెడిత్ (పంజాబ్ కింగ్స్)

* జాయ్ రిచర్డ్సన్ (పంజాబ్ కింగ్స్)

* స్టీవ్ స్మిత్ (ఢిల్లీ క్యాపిటల్స్)

కరోనాతో దూరం.. ఐపీఎల్ 2021 ఏప్రిల్, మేలో భారతదేశంలో జరగాల్సి ఉంది. కరోనాతో కొన్ని మ్యాచులు మాత్రమే నిర్వహించిన అనంతరం ఆటగాళ్లకు కూడా పాజిటివ్ రావడంతో అర్థాంతరంగా పోటీలను నిలిపేశారు. దీంతో ఐపీఎల్ 2021 ఫేజ్ 2 గత సంవత్సరం లాగానే యూఏఈ దుబాయ్, షార్జా, అబూ దాబిలలో నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది.

ప్రేక్షకులను అనుమతిస్తారా..? అయితే, కోవిడ్-19( Covid-19) సంక్షోభంపై భయాల మధ్య ప్రేక్షకులను అనుమతి ఇస్తారా లేదా చూడాలి. ఇంగ్లండ్‌లో జరిగే మ్యాచులకు ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. దీంతో ఐపీఎల్ 2021 రెండవ సీజన్‌కు అభిమానులను అనుమతించాలా వద్దా అనే అంశంపై తీవ్రంగా చర్చలు నడుస్తున్నాయి. “ప్రేక్షకులను అనుమతించాలా వద్దా అనేది చర్చల్లో ఉంది. ఇది ఎన్నో అంశాలకు సంబంధించినది కాబట్టి.. యూఏఈ అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటే, అలాగే నడుచుకుంటాం” అని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఒక ఇంటర్వ్యూలో అన్నారు.

Also Read:

‘ఇదంత పెద్ద విషయమేమీ కాదు.. కేవలం సంచలనం కోసమే నాపేరు వాడారు’: నీరజ్ చోప్రా

Rashid Khan: 3 ఫోర్లు, 2 సిక్సర్లు.. 300 స్ట్రైక్ రేట్‌తో దంచికొట్టాడు.. మ్యాచ్‌కు హీరో అయ్యాడు..

Neeraj Chopra Meets Randeep Hooda: ఫేవరేట్ హీరోని కలుసుకున్న భారత స్టార్ అథ్లెట్..!