AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashid Khan: 3 ఫోర్లు, 2 సిక్సర్లు.. 300 స్ట్రైక్ రేట్‌తో దంచికొట్టాడు.. మ్యాచ్‌కు హీరో అయ్యాడు..

ఐ యామ్‌ ఏ బౌలర్ ఆల్సో.. ఆల్ రౌండర్ ఆల్సో.. ఏదో సినిమాలో ట్యూన్‌లా ఉంది కదూ.. ఈ పాట ఆఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు సరిగ్గా..

Rashid Khan: 3 ఫోర్లు, 2 సిక్సర్లు.. 300 స్ట్రైక్ రేట్‌తో దంచికొట్టాడు.. మ్యాచ్‌కు హీరో అయ్యాడు..
Rashid
Ravi Kiran
|

Updated on: Aug 26, 2021 | 4:20 PM

Share

ఐ యామ్‌ ఏ బౌలర్ ఆల్సో.. ఆల్ రౌండర్ ఆల్సో.. ఏదో సినిమాలో ట్యూన్‌లా ఉంది కదూ.. ఈ పాట ఆఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు సరిగ్గా సరిపోతుంది. టీ20ల్లో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న రషీద్.. ఆల్‌రౌండర్‌గానూ రాణిస్తున్నాడు. ఇదిలా ఉంటే రషీద్ ఖాన్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ఆఫ్గాన్‌ తాలిబన్ల వశం కావడం.. అక్కడే అతడి ఫ్యామిలీ కూడా ఉండటంతో తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. అయితే అదంతా తన ఆటపై ప్రభావం పడకుండా చూసుకుంటున్నాడు. బంతితో మాత్రమే కాదు బ్యాట్‌తో కూడా అద్భుతం చేస్తున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ టీ20 లీగ్ వైటాలిటీ బ్లాస్ట్‌లో రషీద్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. ససెక్స్ టీం తరపున బరిలోకి దిగిన రషీద్ తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.

రివర్‌సైడ్ గ్రౌండ్‌లో యార్క్‌షైర్, ససెక్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో యార్క్‌షైర్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది. ఈ జట్టు 20 ఓవర్లకు ఏడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఓపెనర్ టామ్ కోహ్లెర్ కాడ్‌మోర్(55), గ్యారీ బ్యాలెన్స్(55)లు అర్ధ సెంచరీలతో అదరగొట్టారు.

ఇక లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన ససెక్స్ జట్టు.. 16.3 ఓవర్లకు నాలుగు వికెట్లు నష్టపోయి 135 పరుగులు చేసింది. ఓపెనర్లు లూక్ రైట్(54), ఫిల్ సాల్ట్(27) కలిసి మొదటి వికెట్‌కు 72 పరుగులు జోడించారు. అయితే మిడిల్ ఓవర్లలో స్కోర్ బోర్డు కాస్త నెమ్మదించడంతో.. చివరికి వచ్చేసరికి టార్గెట్ కొండలా మారింది. యార్క్‌షైర్ జట్టు బౌలర్లు పదునైన బంతులతో ససెక్స్ బ్యాట్స్‌మెన్లను ఇబ్బంది పెడుతూ వచ్చారు. 18వ ఓవర్ చివరి బంతికి డేవిడ్ వైస్‌ను కూడా పెవిలియన్‌కు పంపారు.

అయితే అప్పుడే క్రీజులోకి వచ్చిన రషీద్ ఖాన్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. తొమ్మిది బంతుల్లో 300 స్ట్రైక్ రేట్‌తో మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో అజేయంగా 27 పరుగులు సాధించి రెండు బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక రషీద్ ఖాన్ బౌలింగ్ విషయానికి వస్తే, నాలుగు ఓవర్లలో 25 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.

ఇది చదవండి: Viral Photo: చిరుత ఎక్కడుందో కనిపెట్టండి.. చాలామంది ఈ పజిల్‌ను సాల్వ్ చేయలేకపోయారు!

రూ. లక్షకుపైగా జీతంతో బ్యాంక్ ఉద్యోగాలు.. మరికొన్ని గంటలే చాన్స్
రూ. లక్షకుపైగా జీతంతో బ్యాంక్ ఉద్యోగాలు.. మరికొన్ని గంటలే చాన్స్
ఇండియా మ్యాచ్‌లో రూల్స్ బ్రేక్ చేసిన పాక్ మెంటార్..ఐసీసీ యాక్షన్
ఇండియా మ్యాచ్‌లో రూల్స్ బ్రేక్ చేసిన పాక్ మెంటార్..ఐసీసీ యాక్షన్
అసలు రోజుకు ఎన్ని కప్పుల కాఫీ తాగాలి? ఎక్కువైతే ఏం జరుగుతుంది..
అసలు రోజుకు ఎన్ని కప్పుల కాఫీ తాగాలి? ఎక్కువైతే ఏం జరుగుతుంది..
కారును ఢీకొని కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
కారును ఢీకొని కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
రాత్రి నిద్రకు ముందు నీళ్లు తాగే అలవాటు మీకూ ఉందా?
రాత్రి నిద్రకు ముందు నీళ్లు తాగే అలవాటు మీకూ ఉందా?
మీరూ ఇయర్‌ బర్డ్స్‌తో చెవి శుభ్రం చేస్తున్నారా?
మీరూ ఇయర్‌ బర్డ్స్‌తో చెవి శుభ్రం చేస్తున్నారా?
కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీ.. వీటిల్లో ఏది ఆరోగ్యానికి మందో తెల
కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీ.. వీటిల్లో ఏది ఆరోగ్యానికి మందో తెల
భూమిని చీల్చుకుంటూ ఉప్పొంగిన పాతాళ గంగా..!
భూమిని చీల్చుకుంటూ ఉప్పొంగిన పాతాళ గంగా..!
బంగ్లాకు వెన్నుపోటు..సీక్రెట్‎గా వరల్డ్ కప్ కు పాక్ ఏర్పాట్లు
బంగ్లాకు వెన్నుపోటు..సీక్రెట్‎గా వరల్డ్ కప్ కు పాక్ ఏర్పాట్లు
కుంభ రాశిలోకి సూర్య సంచారం.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే..!
కుంభ రాశిలోకి సూర్య సంచారం.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే..!