Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays in September: వచ్చే నెలలో 7 రోజులు బ్యాంకులు పనిచేయవు..ఎప్పుడెప్పుడో తెలుసుకోండి!

ఆర్ధిక లావాదేవీల కోసం బ్యాంక్ కు వెళ్లడం తప్పనిసరి. బ్యాంక్ పని అంటేనే కొంచెం సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది. ఆన్ లైన్ చెల్లింపుల విధానం అందుబాటులోకి వచ్చినా ఇంకా చాలా పనుల కోసం బ్యాంకుకు వెళ్లాల్సి వస్తుంది.

Bank Holidays in September: వచ్చే నెలలో 7 రోజులు బ్యాంకులు పనిచేయవు..ఎప్పుడెప్పుడో తెలుసుకోండి!
Bank Holidays
Follow us
KVD Varma

|

Updated on: Aug 27, 2021 | 7:15 AM

Bank Holidays in September: ఆర్ధిక లావాదేవీల కోసం బ్యాంక్ కు వెళ్లడం తప్పనిసరి. బ్యాంక్ పని అంటేనే కొంచెం సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది. ఆన్ లైన్ చెల్లింపుల విధానం అందుబాటులోకి వచ్చినా ఇంకా చాలా పనుల కోసం బ్యాంకుకు వెళ్లాల్సి వస్తుంది. డిపాజిట్లు చేయడానికి.. డిపాజిట్లను రెన్యూవల్ చేసుకోవడానికి.. అదేవిధంగా అనేక ఇతర పనుల కోసం బ్యాంకుకు వెళ్లాల్సిందే. ముఖ్యంగా నగదు లావాదేవీల కోసం చాలా మంచి చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకూ ప్రతిరోజూ బ్యాంకుకు వెళ్లకపోతే వారికి పనిజరగదు. సాధారణంగా బ్యాంక్ లకు ఆదివారం సెలవు మొదటి నుంచి అమలులో ఉంది. శనివారం సగం రోజు పనిచేసేవి. తరువాత విధానం మారింది. ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారం పూర్తి సెలవు ఇస్తున్నారు. మిగిలిన రెండు శనివారాలు పూర్తిగా బ్యాంకులు పనిచేస్తాయి. ఈ విధానం వచ్చిన తరువాత బ్యాంకులకు వరుస సెలవులు రావడం మొదలైంది. అలా వరుసగా సెలవులు రావడం వల్ల  ఇబ్బంది ఉంటోంది. కానీ, విధాన నిర్ణయం కాబట్టి తప్పదు. బ్యాంకులావాదేవీలు ఎక్కువగా జరిపేవారు వరుస సెల్లవులను ముందుగా గమనిస్తే దానికి అనుగుణంగా తమ పనులను ప్లాన్ చేసుకునే వీలుంటుంది. ప్రతి నెలా ప్రారంభం అవకముందే ఆ నెలలో వచ్చే సెలవులను గమనించడం ద్వారా బ్యాంకు పనులను ప్లాన్ చేసుకునే వీలుంటుంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెప్టెంబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. దాని ప్రకారం, వచ్చే నెలలో ఏడు బ్యాంకు సెలవులు ఉంటాయి. ఈ ఏడు సెలవులు రాష్ట్రాల వారీగా మతపరమైన కార్యక్రమాలు.. పండుగ వేడుకలపై ఆధారపడి ఉంటాయి. ఇది కాకుండా, వచ్చే నెలలో 6 వారాంత సెలవులు కూడా ఉంటాయి. అవి సెలవుల జాబితాలో ఉంటాయి. సెప్టెంబర్ 5, 12, 19, 25 – 26 తేదీలలో బ్యాంకులు మూసివేసి ఉంటాయి. సెప్టెంబర్ 11న ఆర్బీఐకి తప్పనిసరి సెలవు ఉంది. అయితే, ఇది రెండవ శనివారంతో కలిసి ఉంటుంది.

సెప్టెంబర్ నెలలో ఆర్బీఐ బ్యాంక్ సెలవులు ఇలా ఉన్నాయి..(శని, ఆదివారాలు కాకుండా- వీటిలో కొన్ని సెలవులు ఆయా రాష్ట్రాల స్థానిక పండగల ఆధారంగా ఉంటాయి) 

  • సెప్టెంబర్ 8: శ్రీమంత శంకరదేవుని తిథి
  • సెప్టెంబర్ 9: తీజ్ (హరితాళిక)
  • సెప్టెంబర్ 10: గణేష్ చతుర్థి/సంవత్సారి (చతుర్థి పక్ష)/వినాయకర్ చతుర్థి/వరసిద్ధి వినాయక వ్రతం.
  • సెప్టెంబర్ 11: గణేష్ చతుర్థి (2 వ రోజు)
  • సెప్టెంబర్ 17: కర్మ పూజ
  • సెప్టెంబర్ 20: ఇంద్రజాత్రా
  • సెప్టెంబర్ 21: శ్రీ నారాయణ గురు సమాధి దినం

పైన తెలిపిన సెలవులు ఆయా రాష్ట్రాల పరిధిలో మార్పులు ఉండవచ్చు. కొన్ని పండుగల సెలవులు ఆయా ప్రాంతాల్లోనే ఉండవచ్చు. వీటిని గమనించి బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక తెలుగురాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో బ్యాంక్ సెలవులు ఈ విధంగా ఉన్నాయి..

సెప్టెంబర్ నెలలో ఆదివారాలు..5,12,19,26తేదీలు, రెండవ శనివారం 11వ తేదీ, నాలుగవ శనివారం 25వ తేదీ రెగ్యులర్ గా వచ్చే 6 సెలవు రోజులు. ఇవి కాకుండా సెప్టెంబర్ 10వ తేదీ వినాయక చవితి పండుగ సెలవు ఉంది. అంటే సెప్టెంబర్ లో మొత్తం 7రోజులు బ్యాంకులు తెలుగు రాష్ట్రాల్లో పనిచేయవు. ఇక ఈ నెలలో 10వతేదీ వినాయకచవితి, 11వతేదీ రెండో శనివారం, 12వ తేదీ ఆదివారం కారణంగా ఆ మూడురోజులు బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి.

Also Read: మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ అయితే మీకే ఈ గుడ్ న్యూస్..:SBI Customers.

Central Government: కొత్తగా కారు కొనేవారికి శుభవార్త.. దీపావళికి ఆ ప్రకటన వచ్చే అవకాశం..?