AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayanagaram: విజయనగరంలో మునిసిపల్ అధికారుల ఓవరాక్షన్.. పీఠల మీది పెళ్లిని ఆపి మరీ..

Vijayanagaram: విజయనగరంలో మునిసిపల్ అధికారులు ఓవరాక్షన్ చేశారు. ఫంక్షన్ హాల్‌లో పెళ్లి జరుగుతుండగానే అధికారులు పెళ్లి వారిని బయటకు పంపించారు.

Vijayanagaram: విజయనగరంలో మునిసిపల్ అధికారుల ఓవరాక్షన్.. పీఠల మీది పెళ్లిని ఆపి మరీ..
Seized
Shiva Prajapati
|

Updated on: Aug 26, 2021 | 10:01 PM

Share

Vijayanagaram: విజయనగరంలో మునిసిపల్ అధికారులు ఓవరాక్షన్ చేశారు. ఫంక్షన్ హాల్‌లో పెళ్లి జరుగుతుండగానే అధికారులు పెళ్లి వారిని బయటకు పంపించారు. అనంతరం ఆ ఫంక్షన్ హాల్‌ను సీజ్ చేశారు. అధికారుల నిర్వాకంతో పెళ్లికి వచ్చిన బంధువులు ఆగ్రహానికి గురయ్యారు. అధికారులపై తిరగబడ్డారు. ఇదే పద్ధతి అంటూ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

విజయనగరం రింగ్ రోడ్డులో ఉన్న లీ ప్యారడైజ్ కన్వెన్షన్ సెంటర్‌ను.. మునిసిపల్ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని గతంలో అధికారులు కూల్చి వేసేందుకు సిద్ధమయ్యారు. అయితే నిర్వాహకులు మునిసిపల్ అధికారులు ఇచ్చిన నోటీస్ పై కోర్టుని ఆశ్రయుంచి కూల్చివేతను అడ్డుకున్నారు. దింతో కొన్నాళ్ళుగా స్థబ్ధుగా ఉన్న అధికారులు.. ఇవాళ అకస్మాత్తుగా ప్యారడైజ్ ఫంక్షన్ హాల్‌ను సీజ్ చేసేందుకు సిబ్బందితో సహా వచ్చారు. మునిసిపల్ ఏసిపి మధుసూదనరావు తన సిబ్బందితో కలిసి వచ్చి.. నేరుగా ఫంక్షన్ హాల్ మెయిన్ డోర్ సీజ్ చేసేందుకు వెళ్లారు. అయితే ఆ సమయంలో ఫంక్షన్ హాల్ లో వివాహం జరుగుతోంది. అధికారుల చర్యను గమనించిన నవదంపతుల తల్లిదండ్రులు, వారి బంధువులు ఫంక్షన్ హాల్ ను సీజ్ చేయకుండా అడ్డుకున్నారు. అయితే అధికారులు మాత్రం ఏ మాత్రం తగ్గకుండా పెళ్లిబృందాన్ని బయటకు పంపి కల్యాణ మండపాన్ని సీజ్ చేశారు. అధికారుల చర్యపై పెళ్లి పెద్దలు, కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెళ్లి అనేది జీవితంలో ఒక మంచి శుభకార్యం అని, అలాంటి శుభకార్యాన్ని నిలిపివేసి అవమానిస్తారా? అంటూ నిప్పులు చెరిగారు.

ఇదిలాఉంటే.. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఫంక్షన్ హాల్ సీజ్ చేశారని మండిపడ్డారు. ఫంక్షన్ హాల్ నిర్వాహకులు. తమకు హైకోర్టు ఆర్డర్ ఉందని, అయినా సరే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సీజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తుగా తమకు నోటీస్ ఇస్తే పెళ్లిళ్లు క్యాన్సిల్ చేయించేవారమని అన్నారు. పీఠలమీద పెళ్లిని ఆపడం దుర్మార్గం అని అన్నారు.

ఈ వ్యవహారంపై మునిసిపల్ అధికారులు కూడా స్పందించారు. సీజ్ చేయటానికి ఎలాంటి నోటీసులు ఇవ్వనక్కర్లేదని పేర్కొన్నారు. తమ ఉన్నతాధికారుల ఉత్తర్వులు మేరకే ఫంక్షన్ హాల్‌ను సీజ్ చేశామని చెప్పుకొచ్చారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. పీఠల మీద పెళ్లిని నిలిపివేసి ఫంక్షన్ హాల్ సీజ్ చేయడం జిల్లాలో పెను దుమారం రేపుతోంది. జరుగుతున్న పెళ్లిని ఆపి.. బయటకు పంపడం సరైందని కాదని, ఈ చర్యకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని వధువరుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Also read:

Telangana Dalitha Bandhu: దళిత రాగం తీస్తోన్న తెలంగాణ ప్రభుత్వం.. పాలనలో ఊహించని మార్పులు..!

మానవులు ఏలియన్స్‏గా మారిపోవచ్చా ? ఈ పని చేస్తే అయ్యే అవకాశం ఉందంటున్న నిపుణులు..

Big News Big Debate: రేవంత్ రెడ్డి వర్సెస్ మంత్రి మల్లారెడ్డి.. ఈ సవాళ్ల యుద్ధం దేనికి సంకేతం..?