Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Dalitha Bandhu: దళిత రాగం తీస్తోన్న తెలంగాణ ప్రభుత్వం.. పాలనలో ఊహించని మార్పులు..!

Dalitha Bandhu: దళిత రాగం తీస్తుంది తెలంగాణ ప్రభుత్వం. దళిత బంధు మొదలుపెట్టినప్పటి నుంచి ఆ వర్గాలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత లభిస్తుంది.

Telangana Dalitha Bandhu: దళిత రాగం తీస్తోన్న తెలంగాణ ప్రభుత్వం.. పాలనలో ఊహించని మార్పులు..!
Dalitha Bandhu
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 26, 2021 | 9:47 PM

Dalitha Bandhu: దళిత రాగం తీస్తుంది తెలంగాణ ప్రభుత్వం. దళిత బంధు మొదలుపెట్టినప్పటి నుంచి ఆ వర్గాలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత లభిస్తుంది. అయితే ఇది రాజకీయ వ్యూహమా లేక ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధా అనేది పక్కన పెడితే.. ప్రభుత్వంలో కీలక పోస్టులన్నీ దళితులకు అందుతున్నాయి.

హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థిగా ఉన్న మాజీ మంత్రి ఈటల కూడా గతంలో దళితులకు సీఎంవో లో చోటు లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసి బి‌ఎస్‌పి పార్టీలో చేరిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ కూడా దళితులకు తెలంగాణ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందంటూ ఆరోపించారు. రాజీనామా చేసిన మరో ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి కూడా ఇప్పటికీ కేసీఆర్ పై మండిపడుతున్నారు.

ఒకవైపు ఇలాంటి రాజకీయ విమర్శలు వస్తుండగానే సీఎం కేసీఆర్ ‘దళితబంధు’ పథకాన్ని ప్రవేశపెట్టారు. దళితబంధు కేవలం పథకం మాత్రమే కాదు.. ఇది అట్టడుగు నుంచి దళితులను అభివృద్ధి పథంవైపు తీసుకెళ్లే ఉద్యమం అంటూ ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అనుకున్నదే తడవుగా హుజరాబాద్ నియోజకవర్గం నుంచి దళితబంధును పైలెట్ ప్రాజెక్టుగా ప్రకటించారు. ఆ వెంటనే రెండు వేల కోట్ల రూపాయలు మంజూరు చేశారు. అంతేకాదు.. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన లోనూ అనేక మార్పులు చేశారు సీఎం కేసీఆర్.

విమర్శలు అన్నిటికీ చెక్ పెడుతూ ప్రభుత్వంలో కీలక పోస్టులన్నీ దళితులకు కట్టబెట్టారు. తాజాగా సీఎంఓ లో ప్రత్యేక కార్యదర్శిగా రాహుల్ బొజ్జా కు అవకాశం కల్పించారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గా, సైబరాబాద్ కమిషనర్ గా, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ గా ఆ వర్గాలకు కీలక పదవులు లభించాయి. ఇన్నాళ్లూ ఖాళీగా ఉన్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని హుజరాబాద్ నియోజకవర్గానికి చెందిన బండ శ్రీనివాస్ కు ఇచ్చారు. ఇకముందు కూడా జనాభాలో 20 శాతం ఉన్న అట్టడుగు వర్గాలకు ఉన్నత అవకాశాలు లభించనున్నాయని టిఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతోంది. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న కాలంలో మరెన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.

(రాకేష్, టీవీ9 తెలుగు రిపోర్టర్)

Also read:

మానవులు ఏలియన్స్‏గా మారిపోవచ్చా ? ఈ పని చేస్తే అయ్యే అవకాశం ఉందంటున్న శాస్త్రవేత్తలు..

Big News Big Debate: రేవంత్ రెడ్డి వర్సెస్ మంత్రి మల్లారెడ్డి.. ఈ సవాళ్ల యుద్ధం దేనికి సంకేతం..?

Kabandha in Ramayana: రామాయణంలో కబంధుడు ఎవరు.. కబంధ హస్తాలు అన్న మాట ఎలా వాడుకలోకి వచ్చిందంటే