Viral Video: అయ్యబాబోయ్.! భారీ కొండచిలువ.. హడలెత్తిపోయిన స్థానికులు..
సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన చీమ చిటుక్కుమన్నా వెంటనే విషయం తెలిసిపోతోంది. పాములు, పక్షులు..
సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన చీమ చిటుక్కుమన్నా వెంటనే విషయం తెలిసిపోతోంది. పాములు, పక్షులు, జంతువులు, పిల్లలు మొదలు, పెద్దలదాకా..ఎన్నో వింతలు విశేషాలు ఇట్టే సోషల్ మీడియాలో కథనాలుగా ప్రత్యక్షమవుతున్నాయి. అయితే, తాజాగా విశాఖపట్నంలో ప్రత్యక్షమైన భారీ కొండచిలువ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.
విశాఖ నగరంలోని ఎండాడలో భారీ కొండచిలువ కనిపించింది. జనావాసాల్లోకి వచ్చిన కొండచిలువ స్థానికులు హడలెత్తించింది. జనావాసాల్లోకి దూరిన కొండచిలువ పొదలవైపు వెళ్తుండగా గుర్తించిన స్థానికులు భయంతో స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. స్నేక్ క్యాచర్ శ్రీనివాసరావు 8 అడుగుల కొండచిలువను పట్టుకుని దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.