AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Find Snake: మీ కంటి పనితీరుకు ఇదొక పరీక్ష… ఈ ఫొటోలో పాము దాగి ఉంది. కనిపించించలేదా? అయితే స్టోరీలోకి వెళ్లండి.

Find Snake: 'ఈ ఫొటోలో చిరుత దాగి ఉంది కనిపెట్టండి'.. 'ఇందులో సింహం నక్కి ఉంది చూడండి' అంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలు తెగ వైరల్‌గా మారుతున్నాయి. కంటి చూపును పరీక్షించేలా..

Find Snake: మీ కంటి పనితీరుకు ఇదొక పరీక్ష... ఈ ఫొటోలో పాము దాగి ఉంది. కనిపించించలేదా? అయితే స్టోరీలోకి వెళ్లండి.
Snake In Photo
Narender Vaitla
|

Updated on: Aug 27, 2021 | 8:28 AM

Share

Find Snake: ‘ఈ ఫొటోలో చిరుత దాగి ఉంది కనిపెట్టండి’.. ‘ఇందులో సింహం నక్కి ఉంది చూడండి’ అంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలు తెగ వైరల్‌గా మారుతున్నాయి. కంటి చూపును పరీక్షించేలా.. మెదడుకు మెత పెట్టేలా ఉన్న ఈ ఫొటో ఫజిల్స్‌ నెటిజెన్లను తీవ్రంగా ఆకర్షిస్తున్నాయి. క్యూరియాసిటీలో భాగంగా ఫజిల్‌ను సాల్వ్‌ చేసేందుకు కుస్తీలు పడుతున్నారు. ప్రస్తుతం తాజాగా అలాంటి ఓ ఫొటోనే నెట్టింట వైరల్‌గా మారింది. ఒక చెట్టు బెరడుకు సంబంధించిన ఫొటోలో దాగి ఉన్న పాముకు సంబంధించిన ఫొటోను నెటిజన్లు వాట్సాప్‌ గ్రూప్‌లలో షేర్‌ చేస్తూ ఛాలెంజ్‌ విసురుతున్నారు.

సుశాంత నందా అనే ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌ ట్విట్టర్‌లో ఓ ఫొటోను పోస్ట్‌ చేశాడు. ఈ ట్వీట్‌లో చెట్టుబెరడును పోస్ట్‌ చేసిన సుశాంత.. ‘బాగా మభ్యపెడుతోంది’ అంటూ క్యాప్షన్‌ జోడించాడు. అయితే ఫొటోలో ఓ పాము ఉందన్న విషయం దీర్ఘంగా గమనిస్తే కానీ కనిపించదు. ఎందుకంటే పాము రంగు అచ్చంగా చెట్టు బెరడు రంగును పోలి ఉండడమే. కానీ కాస్త జూమ్‌ చేసిన చూస్తే పాము స్పష్టంగా కనిపిస్తోంది. మరి మీరు కూడా పాము జాడను వెతికే ప్రయత్నం చేయండి. ఒక వేళ కనిపిస్తే.. స్క్రీన్‌ షాట్‌ తీసి పాము ఎక్కడుందో చూపిస్తూ కామెంట్‌ చేయండి.

Also Read: చివరి బంతికి 2 పరుగులు.. ధోని క్రీజులో.. కేఎల్ రాహుల్ 46 బంతుల్లో సెంచరీ.. మామూలుగా లేదు మ్యాచ్‌..

Moral Stories for Kids: ప్రేమతో, దయతో మన తలరాతని ఎలా మనం మార్చుకోవచ్చు తెలియజెప్పే కథ

Ginger Farmers: కిలో అల్లం రూ.20నే.. చేసేదేం లేక పొలాల్లోనే పంటను దున్నేస్తున్న రైతులు