Meal Maker kurma: మిల్ మేకర్ కుర్మా ఇలా చేయండి.. కొంచెం కూడా మిగల్చకుండా మొత్తం లాగించేస్తారు!!

మిల్ మేకర్స్.. వెజిటేరియన్ల నాన్ వెజ్ అని దీనికి పేరు. మిల్ మేకర్స్ తో రకరకాల వంటలు తయారు చేసుకోవచ్చు. మిల్ మేకర్ పులావ్, మిల్ మేకర్ కుర్మా.. పేర్లు చెప్పగానే లాలాజలం ఊరుతోంది కదూ. కానీ ఇంట్లో అంత ఓపికగా చేసుకోలేక కొందరు.. ఎలా చేయాలో తెలీక ఇంకొందరు రెస్టారెంట్లలో లభించే కూరల వైపు మొగ్గుచూపుతుంటారు. అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదా.. దాని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. అందుకే ఇంట్లోనో ఈజీగా హెల్దీగా మిల్ మేకర్ కుర్మా ఎలా తయారు..

Meal Maker kurma: మిల్ మేకర్ కుర్మా ఇలా చేయండి.. కొంచెం కూడా మిగల్చకుండా మొత్తం లాగించేస్తారు!!
Meal Maker Curry
Follow us
Chinni Enni

|

Updated on: Aug 07, 2023 | 9:32 PM

మిల్ మేకర్స్.. వెజిటేరియన్ల నాన్ వెజ్ అని దీనికి పేరు. మిల్ మేకర్స్ తో రకరకాల వంటలు తయారు చేసుకోవచ్చు. మిల్ మేకర్ పులావ్, మిల్ మేకర్ కుర్మా.. పేర్లు చెప్పగానే లాలాజలం ఊరుతోంది కదూ. కానీ ఇంట్లో అంత ఓపికగా చేసుకోలేక కొందరు.. ఎలా చేయాలో తెలీక ఇంకొందరు రెస్టారెంట్లలో లభించే కూరల వైపు మొగ్గుచూపుతుంటారు. అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదా.. దాని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. అందుకే ఇంట్లోనో ఈజీగా హెల్దీగా మిల్ మేకర్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

మిల్ మేకర్ కుర్మాకు కావలసిన పదార్థాలు:

ఉల్లిపాయలు – పెద్దవి 2, పచ్చిమిర్చి -2, జీడిపప్పు -2 టేబుల్ స్పూన్లు, పెరుగు -1/4 కప్పు, వేడి నీళ్లలో గంటపాటు నానబెట్టిన మిల్ మేకర్ -50 గ్రాములు, నూనె- 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్, గరం మసాలా – 1 అర టీ స్పూన్, ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్, కారం – 1 టేబుల్ స్పూన్, ఉప్పు – రుచికి తగినంత, జీలకర్ర పొడి – 1/2 టీ స్పూన్, టమాటాలు – 100 గ్రాములు, చింతపండు పులుసు -4 చెంచాలు, నీళ్లు – 1/2 కప్పు, తరిగిన కొత్తిమీర.

ఇవి కూడా చదవండి

తయారీ విధానం:

*ఉల్లిపాయలను నిలువుగా కట్ చేసి.. వేయించుకోవాలి. ఒక మిక్సీ జార్ లో వేయించిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, పెరుగు వేసి మెత్తటి పేస్ట్ గా గ్రైండ్ చేయాలి.

*వేడినీటిలో ఉంచిన మిల్ మేకర్ లను నీరు లేకుండా పిండి పక్కన పెట్టుకుని.. మరో కడాయిలో నూనె వేసి వేడయ్యాక మిల్ మేకర్ లను దోరగా వేయించాలి.

*వాటిని తీసేసి.. ఇంకొంచెం నూనె వేసి.. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరంమసాలా, ఉప్పు, కారం, జీలకర్రపొడి, ధనియాల పొడి వేసి పచ్చివాసన పోయేలా వేయించాలని. అలాగే టమాటాలను మిక్సీ పట్టి.. ఆ గుజ్జును వేసి వేగనివ్వాలి.

*మిక్సీపట్టి పక్కకు పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ను కూడా ఈ మిశ్రమంలో వేసి.. నూనె పైకి తేలేంతవరకూ మరికొద్ది సేపు వేయించాలి. ఇప్పుడు నాలుగు స్పూన్ల చింతపండు పులుసు వేసి కలపాలి.

*2 నిమిషాల తర్వాత వేయించిన మిల్ మేకర్లను అందులో వేసి, అరకప్పు నీరుపోసి కలపాలి. కడాయిపై మూతపెట్టి సన్నని మంటపై ఉడికించాలి. నీరు ఇగిరిపోయి గుజ్జుగా అవుతుండగా.. సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

అంతే .. ఘుమఘమలాడే మిల్ మేకర్ కర్రీ రెడీ. దీనిని అన్నం, చపాతీల్లో హ్యాపీగా తినవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.