Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andu Korralu: అండు కొర్రలతో రొట్టెలు.. వెయిట్ లాస్, షుగర్ పేషంట్లకు నిజంగా అమృతమే!!

మారుతున్న జీవనశైలితో మనమూ మారాలని ఎవరు అన్నారో గానీ.. నిజంగా ఇప్పుడు అదే జరుగుతుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని పట్టించుకునే తీరిక ఉండని వారందరికీ.. చిరు ధాన్యాలే ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీగా మారుతున్నాయి. అన్నం కంటే ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం.. బరువు కూడా కంట్రోల్ లో ఉండటంతో పాటు.. షుగర్, బీపీలు కూడా రాకుండా కాపాడుతాయి. చిరుధాన్యాల్లో అండుకొర్రలు..

Andu Korralu: అండు కొర్రలతో రొట్టెలు.. వెయిట్ లాస్, షుగర్ పేషంట్లకు నిజంగా అమృతమే!!
Andu Korralu
Follow us
Chinni Enni

|

Updated on: Aug 07, 2023 | 7:09 PM

మారుతున్న జీవనశైలితో మనమూ మారాలని ఎవరు అన్నారో గానీ.. నిజంగా ఇప్పుడు అదే జరుగుతుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని పట్టించుకునే తీరిక ఉండని వారందరికీ.. చిరు ధాన్యాలే ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీగా మారుతున్నాయి. అన్నం కంటే ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం.. బరువు కూడా కంట్రోల్ లో ఉండటంతో పాటు.. షుగర్, బీపీలు కూడా రాకుండా కాపాడుతాయి. చిరుధాన్యాల్లో అండుకొర్రలు కూడా ఒకటి.

అండుకొర్రలు ఆహారంగా తీసుకుంటే.. మలబద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గడమే కాకుండా.. పెద్దప్రేగు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం. వీటిలో ఉండే విటమిన్ B3 శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించి అధిక బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అలాంటి అండుకొర్రలతో రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.

*అండుకొర్రల రొట్టెల తయారీకి.. ముందుగా అండుకొర్రలను శుభ్రంగా కడిగి నీటిలో పోసి 8 గంటలసేపు నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని వడగట్టి ఎండలో పోసి ఆరబెట్టాలి.

ఇవి కూడా చదవండి

*ఎండిన అండుకొర్రలను ఒక కడాయిలో వేసి దోరగా వేయించి.. పిండి పట్టించుకోవాలి. ఒకకిలో అండుకొర్రల పిండికి 100 గ్రాముల మినపప్పు పిండిని కలపాలి.

*ఇలా కలిపి పెట్టుకున్న పిండిలో.. మీకు రొట్టెల తయారీకి కావలసిన మోతాదులో పిండిని తీసుకుని, రుచికి తగినంత ఉప్పువేసి.. తగినన్ని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. దీనిని గంటసేపు నాననివ్వాలి.

*రొట్టెల కోసం కలిపి ఉంచుకున్న పిండిలో.. రొట్టెను తయారు చేసుకునే పరిమాణంలో పిండిని తీసుకుని.. పొడిపిండి చల్లుతూ.. చపాతీల మాదిరిగా కర్రతో ఒత్తుకోవాలి. ఈ రొట్టెను పెనంపై వేసుకుని.. తడి అద్దుతూ కాల్చుకోవాలి. అంతే అండు కొర్రల రొట్టె తయారవుతుంది.

*ఈ రొట్టెలను రోజూ ఆహారంగా తీసుకుంటే షుగర్ కంట్రోల్ అవడంతో పాటు బరువు కూడా ఈజీగా తగ్గుతారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి