Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eye puffiness: కళ్ల కింద వాపులు వస్తున్నాయా? ఈ జాగ్రత్తలు పాటిస్తే ఇట్టే పోతాయి!

కొందరికి అప్పుడప్పుడు కళ్లు వాచిపోతుంటాయి. కళ్ల కింద వాపులు రావడం వల్ల ముఖమంతా ఉబ్బరంగా కనిపిస్తుంటుంది. వాతావరణం చల్లబడినపుడు ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. వర్షాకాలం, శీతాకాలంలో కళ్ల వాపుల సమస్యలు అధికంగా చూస్తుంటాం. ఈ సమస్య ఉన్నవారు కొన్ని సింపుల్ జాగ్రత్తలను పాటించడం, కొన్నిరకాల ఆహారాలను తీసుకోవడం వల్ల కళ్ల వాపుల సమస్యను అధిగమించవచ్చు. కళ్లకింద వాపులకు మొదటి కారణం నిద్రలేమి అయితే.. రెండో కారణం అతినిద్ర. నిద్ర తక్కువైనా..

Eye puffiness: కళ్ల కింద వాపులు వస్తున్నాయా? ఈ జాగ్రత్తలు పాటిస్తే ఇట్టే పోతాయి!
Eye Puffiness
Follow us
Chinni Enni

|

Updated on: Aug 07, 2023 | 9:20 PM

కొందరికి అప్పుడప్పుడు కళ్లు వాచిపోతుంటాయి. కళ్ల కింద వాపులు రావడం వల్ల ముఖమంతా ఉబ్బరంగా కనిపిస్తుంటుంది. వాతావరణం చల్లబడినపుడు ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. వర్షాకాలం, శీతాకాలంలో కళ్ల వాపుల సమస్యలు అధికంగా చూస్తుంటాం. ఈ సమస్య ఉన్నవారు కొన్ని సింపుల్ జాగ్రత్తలను పాటించడం, కొన్నిరకాల ఆహారాలను తీసుకోవడం వల్ల కళ్ల వాపుల సమస్యను అధిగమించవచ్చు.

-కళ్లకింద వాపులకు మొదటి కారణం నిద్రలేమి అయితే.. రెండో కారణం అతినిద్ర. నిద్ర తక్కువైనా.. ఎక్కువైనా కళ్లు వాచిపోతుంటాయి. కాబట్టి రోజుకి 7 గంటలు ఖచ్చితంగా నిద్రఉండేలా చూసుకోవాలి. అలాగే రాత్రివేళల్లో ఎక్కువగా ఫోన్లు చూడటం, కంప్యూటర్లను వాడటం తగ్గించాలి.

-శరీరానికి అవసరమైనంత నీటిని తాగకపోవడం వల్ల కూడా కళ్ల కింద వాపులు వస్తాయి. రోజుకు కనీసం 4 లీటర్ల నీళ్లైనా తాగాలి.

ఇవి కూడా చదవండి

-కళ్లకింద వాపులు ఉన్నవారు రెండుపూటలా ఒక గ్లాసు కొబ్బరినీరు తాగితే సమస్య తగ్గుతుంది.

-తినే ఆహారంలో విటమిన్ సి ఉండేలా చూసుకోవాలి. విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తింటే.. కళ్ల కింద వాపుల సమస్యను తగ్గించుకోవచ్చు.

-ఒత్తిడి వల్ల కూడా కళ్లకింద వాపులు వస్తాయి. కాబట్టి ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ప్రాణాయామం, సూర్యనమస్కారాలు వంటివి చేస్తూ ఉండాలి. తరచూ కళ్లను చన్నీటితో కడుగుతూ ఉంటే.. కళ్లకింద వచ్చిన వాపు తగ్గుతుంది.

-కళ్లు వాచినపుడు ఎక్కువగా టీవీ చూడటం, గంటల తరబడి కంప్యూటర్ వర్క్ చేయడం వంటివి చేయకూడదు. అలా చేస్తే.. కంటి నరాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి పైన పేర్కొన్న జాగ్రత్తలను పాటించడం ద్వారా కళ్ల కింద వాపులను తగ్గించుకోండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి