AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: స్వీట్స్ తింటే ఆ సమస్య వస్తుందా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

నేటి కాలంలో వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలలో ఫ్యాటీ లివర్ ఒకటి. ఇది క్రమంగా కాలేయాన్ని బలహీనపరిచి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. ఊబకాయం, ఆల్కహాల్, నూనె పదార్థాలు దీనికి సాధారణ కారణాలు. కానీ స్వీట్లు తినడం వల్ల కూడా ఫ్యాటీ లివర్ ప్రమాదం పెరుగుతుందా? అనేది తెలుసుకుందాం.

Health Tips: స్వీట్స్ తింటే ఆ సమస్య వస్తుందా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
Sweet Foods Increase Fatty Liver Disease
Krishna S
|

Updated on: Aug 22, 2025 | 7:51 PM

Share

మారుతున్న జీవనశైలి కారణంగా ఎదురవుతున్న తీవ్రమైన ఆరోగ్య సమస్యల్లో ఫ్యాటీ లివర్ ఒకటి. కాలేయ కణాలలో 5-10శాతం కంటే ఎక్కువ కొవ్వు పేరుకుపోయినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఊబకాయం, అనారోగ్యమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం, మధుమేహం దీనికి ప్రధాన కారణాలు. అయితే అధికంగా స్వీట్లు తినడం కూడా ఫ్యాటీ లివర్‌కు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫ్యాటీ లివర్ ఎలా ప్రభావితం చేస్తుంది?

ఫ్యాటీ లివర్ ప్రారంభ దశలో పెద్దగా లక్షణాలు కనిపించవు. కొద్దిగా అలసట, కడుపు కుడివైపున తేలికపాటి నొప్పి లేదా భారంగా అనిపించవచ్చు. సమస్య పెరిగే కొద్దీ, కాలేయ కణాలు దెబ్బతిని హెపటైటిస్‌కు దారితీస్తుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే, ఇది లివర్ ఫైబ్రోసిస్, సిర్రోసిస్ లివర్ ఫెయిల్యూర్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. అంతేకాకుండా ఇది గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

స్వీట్లు తింటే ఫ్యాటీ లివర్ ఎలా వస్తుంది?

అధికంగా స్వీట్లు, కేకులు, కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూస్‌లలో ఉండే ఫ్రక్టోజ్ కాలేయాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం.. అధిక చక్కెర తీసుకోవడం ఆల్కహాల్ లాగే కాలేయాన్ని దెబ్బతీస్తుందని తేలింది. స్వీట్లు తినడం వల్ల బరువు కూడా వేగంగా పెరుగుతుంది. ఇది ఫ్యాటీ లివర్‌కు అతి పెద్ద కారణంగా పరిగణించబడుతుంది.

నివారణ చర్యలు

ఫ్యాటీ లివర్‌ను నివారించడానికి కొన్ని చిట్కాలు:

ఆరోగ్యకరమైన ఆహారం: రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు ఉన్న పదార్థాలు చేర్చుకోవాలి.

తీపి పదార్థాలు తగ్గించండి: స్వీట్లు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, కూల్ డ్రింక్స్ పరిమితం చేయండి.

శారీరక శ్రమ: క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేయడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.

బరువు అదుపు: అధిక బరువు ఫ్యాటీ లివర్‌కు ప్రధాన కారణం కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవాలి.

మద్యం మానేయాలి: మద్యం కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది.. కాబట్టి దానిని పూర్తిగా మానేయాలి.

వైద్య పరీక్షలు: ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు.

ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..