AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Men Health Tips: పురుషులు తప్పనిసరిగా ఈ వ్యాయామం చేయండి.. స్టామినా ఆ సమయంలో పెరుగుతుంది

వ్యాయామం చేయడం ద్వారా మీరు శారీరకంగా ఫిట్‌గా ఉండటమే కాకుండా మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా చక్కగా ఉంచుకుంటారు. పురుషులకు మాత్రమే ప్రత్యేకమైన వ్యాయామాలు ఉన్నాయి. ఫిట్‌గా ఉండటానికి పురుషులు ఏ వ్యాయామం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

Men Health Tips: పురుషులు తప్పనిసరిగా ఈ వ్యాయామం చేయండి.. స్టామినా ఆ సమయంలో పెరుగుతుంది
Men Must Do This Exercise
Sanjay Kasula
|

Updated on: Feb 03, 2023 | 2:22 PM

Share

వ్యాయామం అనేది శారీరక దృఢత్వం, ఆరోగ్యం కోసం చేసే శారీరక ప్రక్రియ. వ్యాయామం ఎక్కువగా కండరాలను, రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరచడానికి, క్రీడలలో మంచి ప్రావీణ్యత సాధించడానికి, అధిక బరువు తగ్గించుకోవడానికి, మానసిక ఉల్లాసం కొరకు చేస్తారు. క్రమం తప్పకుండా చేసే వ్యాయామం వలన మన శరీరపు వ్యాధినిరోధక శక్తి పెంపొందుతుంది. గుండెకు సంబంధించిన వ్యాధులు, స్థూలకాయం, మధుమేహం వంటి వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది. కొన్ని రకాల మానసిక వ్యాధుల వారికి ఇది తోడ్పడుతుంది. శారీరక అందాన్ని పెంపొందించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని కలుగచేస్తుంది. తద్వారా మానసిక ఒత్తిడుల నుంచి కూడా దూరం చేస్తుంది. బాల్యంలోనే వచ్చే ఊబకాయం లాంటి సమస్యలకు వ్యాయామం చక్కటి పరిష్కారం.

వ్యాయామం చేయడం ద్వారా, మీరు శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడమే కాకుండా మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా చక్కగా ఉంచుకుంటారు. వ్యాయామం ప్రతి మనిషికి ప్రయోజనకరం, వ్యాయామం చేయడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుంది. వ్యాయామం చేయడం వల్ల రోజంతా మీ మూడ్‌ బాగుంటుంది. రిలాక్స్‌గా అనిపించడం అన్నింటికంటే పెద్ద విషయం.

అనేక వ్యాయామాలు ఒకే విధంగా ఉన్నప్పటికీ పురుషులు.. మహిళలు, కానీ పురుషులకు మాత్రమే కొన్ని ప్రత్యేక వ్యాయామాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, ఫిట్‌గా ఉండటానికి పురుషులు ఏ వ్యాయామం చేయాలో తెలుగుసుకుందాం..

పురుషులు తప్పనిసరిగా ఈ వ్యాయామం చేయాలి – డెడ్ లిఫ్ట్ –

డెడ్ లిఫ్ట్ అనేది పురుషులకు చాలా ముఖ్యమైన వ్యాయామం. అయితే డెడ్‌లిఫ్ట్‌కి సరైన మార్గాన్ని మీరు తెలుసుకోవాలి. డెడ్‌లిఫ్ట్ వ్యాయామం చేయడం ద్వారా, మీ కండరాలు బలంగా మారుతాయని.. ఇలా చేయడం ద్వారా, రక్తంలో టెస్టోస్టెరాన్ పరిమాణం కూడా పెరుగుతుంది. అందుకే పురుషులకు ఈ వ్యాయామం చాలా ముఖ్యం.

బ్యాక్ స్క్వాట్ –

బ్యాక్ స్క్వాట్ – కూడా డెడ్ లిఫ్ట్ లాగానే ఉంటుంది.. కానీ ఇందులో డంబెల్ ఎత్తలేదు, డంబెల్ ను వెనుక నుంచి భుజంపై ఉంచి స్క్వాట్ చేస్తారు. ఈ వ్యాయామంలో మీ శరీరం మొత్తం పని చేస్తుంది. అదే సమయంలో ఈ వ్యాయామం చేయడం వల్ల కాళ్లు దృఢంగా మారుతాయి. అందుకే పురుషులు తప్పనిసరిగా ఈ వ్యాయామం చేయాలి.

బెంచ్ ప్రెస్

ప్రపంచవ్యాప్తంగా జిమ్‌కి వెళ్లే వారందరూ బెంచ్ ప్రెస్ చేస్తారు, అందులో బెంచ్‌పై పడుకుని డంబెల్స్ ఎత్తాలి. ఇలా చేయడం వల్ల మీ ఛాతీ వెడల్పుగా మారుతుంది. చేతుల కండరాలు కూడా బలంగా మారుతాయి. అందుకే పురుషులు తప్పనిసరిగా ఈ వ్యాయామం చేయాలి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం