White Hair: ఈ ఆహారాలను ఎక్కువగా తింటే.. తెల్ల జుట్టు రావడం ఖాయం..!

నల్లటి జుట్టులో ఒక్క తెల్ల వెంట్రుక వచ్చినా.. చాలా మంది కంగారు పడుతుంటారు. ఎందుకంటే తెల్ల జుట్టు వృద్ధాప్యానికి సంకేతం. అందుకే..

White Hair: ఈ ఆహారాలను ఎక్కువగా తింటే.. తెల్ల జుట్టు రావడం ఖాయం..!
White Hair
Follow us

|

Updated on: Feb 04, 2023 | 8:45 AM

మానవ జీవితంలో జుట్టుకు ప్రత్తేక స్థానం ఉంటుంది. ఇక నల్లని జుట్టు అంటే చెవులు కోసేసుకునేవారు చాలా మందే ఉంటారు. అలాంటివారి తలలో ఒక్క తెల్ల వెంట్రుక కనిపించినా వారి బాధ చెప్పలేనిది, వర్ణనాతీతంగా ఉంటుంది. వాస్తవానికి ఇది అందరినీ భయపెట్టే విషయం. నల్లటి జుట్టులో ఒక్క తెల్ల వెంట్రుక వచ్చినా.. చాలా మంది కంగారు పడుతుంటారు. ఎందుకంటే తెల్ల జుట్టు వృద్ధాప్యానికి సంకేతం. అందుకే.. ఆ వైట్ హెయిర్ కవర్ చేయడానికి రంగులు, హెన్నాలు పూసేస్తుంటారు. వయసు పెరిగిన కొద్దీ తెల్ల జుట్టు రావడం సహజం. అయితే.. కొందరికి యవ్వనంలోనే ఈ సమస్య ఇబ్బంది పెడుతుంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే.. జన్యుపరమైన కారణం ఒకటైతే.. మీరు తీసుకునే ఆహారం మరో కారణం. అవును ఇది నిజమే.. మీరు పాటించే ఆహారపు అలవాట్ల కారణంగానే మీ జుట్టు చిన్న వయసులో తెల్లబడుతోంది. మరి మీ ఆహారపు అలవాట్ల నుంచి ఏయే ఆహారాలను తొలగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

చక్కెర: చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్లు, ఇతర ఆహారాలను ఎక్కువగా తినేవారికి జుట్టు త్వరగా తెల్లబడుతుంది. వెంట్రుకలు వేగంగా తెల్లగా మారుతాయి. జుట్టు పెరుగుదలకు, నల్లబడేందుకు విటమిన్ ఇ ఎంతగానో అవసరం. అయితే చక్కెర ఎక్కువగా తీసుకుంటే దాంతో శరీరం విటమిన్ ఇ ని గ్రహించలేదు. ఫలితంగా జుట్టు త్వరగా తెల్లగా అవుతుంది.

ఉప్పు: ఉప్పు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ద్రవాలు నియంత్రణలో ఉండవు. దీనికి తోడు ఆ ప్రభావం జుట్టుపై కూడా పడుతుంది. ఉప్పులో ఉండే సోడియం శరీరంలో ఎక్కువగా చేరితే జుట్టు సమస్యలే కాదు, కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి.

ఇవి కూడా చదవండి

కూల్ డ్రింక్స్: జుట్టు తెల్లబడేందుకు కూల్ డ్రింక్స్ కూడా ఒక కారణమే. ఎందుకంటే వీటిలో సోడా, చక్కెర ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు అవసరమైన విటమిన్లను శరీరం తీసుకోకుండా అడ్డుకుంటాయి. దీంతో జుట్టు త్వరగా తెల్లబడుతుంది.

మోనోసోడియం గ్లూటమేట్: మోనోసోడియం గ్లూటమేట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్‌ ను తరచూ ఎక్కువగా తీసుకున్నా వెంట్రుకలు త్వరగా నెరుస్తాయి. ఎందుకంటే ఈ పదార్థం మన శరీర మెటబాలిజం ప్రక్రియపై ప్రభావం చూపుతుంది. దీంతోపాటు జుట్టు సమస్యలను కలిగిస్తుంది.