Kidney Care: కిడ్నీల ఆరోగ్యం కోసం తీసుకోవలసిన ఫలాలివే.. తింటే అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టినట్లే..

శరీరంలోని వ్యర్థాలను, విష పదార్థాలను తొలగించేందుకు పనిచేసే మూత్రపిండాల పనితీరు మీదనే మన శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. వీటి విషయంలో ఏ మాత్రం..

Kidney Care: కిడ్నీల ఆరోగ్యం కోసం తీసుకోవలసిన ఫలాలివే.. తింటే అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టినట్లే..
Kidney Health
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 04, 2023 | 7:10 AM

మారుతున్న జీవన శైలికి అనుగుణంగా మన ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడవలసి ఉంటుంది. అలా జాగ్రత్తలు పాటించకపోతే ముందుగా సమస్యలను ఎదుర్కొనేవి మన మూత్రపిండాలే. మానవ శరీరంలో అతి ముఖ్యమైనవి మూత్రపిండాలు. శరీరంలోని వ్యర్థాలను, విష పదార్థాలను తొలగించేందుకు పనిచేసే మూత్రపిండాల పనితీరు మీదనే మన శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. వీటి విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. అయితే మన మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతినడానికి ఎన్నో కారణాలున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి అనేక జీవనశైలి మార్పు వలన కలిగే వ్యాధులే మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తాయి.

ఈ క్రమంలో మూత్రపిండాల వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించడానికి ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. మూత్రపిండాల ఆరోగ్యం బాగుండాలంటే మీ ఆహారంలో ఉప్పును చాలా వరకు తగ్గించాలి. అలాగే నీటిని పుష్కలంగా తాగాలి. ఇవన్నీ చేస్తేనే మీ మూత్రపిండాల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మూత్రపిండాల ఆరోగ్యం కోసం కోలాలతో సహా కృత్రిమ శీతల పానీయాలకు వీలైనంత దూరంగా ఉండాలి. అలాగే తీపి పదార్థాలను ఎక్కువగా తినకూడదు. శాఖాహారాలనే ఎక్కువగా తినాలి. అలాగే కొన్ని రకాల పండ్లను తినడం వల్ల అవి మన కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని రోజూ తినాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ పండ్లు ఏమిటనే వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

స్ట్రాబెర్రీలు: స్ట్రాబెర్రీలు , బ్లూబెర్రీస్ వంటి బెర్రీలలు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ బెర్రీల్లో మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచే విటమిన్ సి, ఫైబర్  కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ బెర్రీలు కిడ్నీ స్టోన్స్ ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఆపిల్: ఆపిల్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి పండును రోజూ ఒకటి తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా మూత్రపిండాల ఆరోగ్యం బాగుంటుంది కూడా. విటమిన్ బి, కాల్షియం పుష్కలంగా ఉండే యాపిల్స్ గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.

అనాస పండు: మీ రోజువారీ ఆహారంలో పైనాపిల్ ను చేర్చుకోవడం వల్ల మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండే పైనాపిల్ మూత్రపిండాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.

ద్రాక్ష: యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ద్రాక్ష మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. అంతేకాదు గుండె జబ్బులను నివారించడానికి కూడా ఈ పండు సహాయపడుతుంది.

నారింజ: నారింజతో సహా సిట్రిస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు మన మూత్రపిండాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!