Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pomegranate Benefits: దానిమ్మ పండు తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..? లెక్కించడం కూడా కష్టమే..

పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మన శరీరానికి కావలసిన పోషకాలను కలిగి ఉండే ఈ పండ్లలో దానిమ్మ పండు ఆరోగ్యానికి వరం వంటిది. దీనిని తినడం

Pomegranate Benefits: దానిమ్మ పండు తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..? లెక్కించడం కూడా కష్టమే..
Pomegranate Benefits
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 04, 2023 | 8:10 AM

పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మన శరీరానికి కావలసిన పోషకాలను కలిగి ఉండే ఈ పండ్లలో దానిమ్మ పండు ఆరోగ్యానికి వరం వంటిది. దీనిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. దానిమ్మను పోషకాహారానికి పవర్‌హౌస్ అంటారు. దానిమ్మ గింజలలో ఉండే ఫైటోకెమికల్స్, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, విటమిన్-సి లాంటి ఔషధ గుణాలు ఉన్నాయి. తద్వారా ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. వైద్యారోగ్య నిపుణుల ప్రకారం రోజువారీ ఆహారంలో దానిమ్మను చేర్చుకోవడం వల్ల బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెజర్, రోగనిరోధక శక్తి, అధిక దాహం, కడుపులో మంట, జీర్ణక్రియ , జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.  ఇంకా ఇది పురుషులలోని మన స్పెర్మ్ కౌంట్, వీర్యం నాణ్యతను మెరుగుపరుస్తుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు, షుగర్ పేషెంట్లు దానిమ్మను తినడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది.  దానిమ్మపండులో ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి జీర్ణ శక్తిని పెంచడంలో సహాయపడతాయి. దానిమ్మ పండు మలబద్ధకం దూరం చేస్తుంది. దానిమ్మ పండు తినడం లేదా జ్యూస్ తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. బీపీ ఉన్నవారు దానిమ్మపండు తీసుకోవడం వల్ల కంట్రోల్ లో ఉంటుంది. ఎముకల ఆరోగ్యంగా ఉంచటానికి దానిమ్మ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది అల్జీమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్లను అడ్డుకుంటుంది. దానిమ్మ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌తో పోరాడి వృద్ధాప్యం త్వరగా రాకుండా చేస్తుంది. ఈ పండులో ఉండే సుగుణాలు అల్జీమర్స్‌, రొమ్ము, చర్మ క్యాన్సర్లకు అడ్డుకట్టవేస్తుంది. గుండె జబ్బులకు చెక్‌ పెట్టడానికి కూడా దానిమ్మ బాగా ఉపయోగపడుతుంది.

ఇంకా రోజుకో గ్లాసు దానిమ్మ రసం తాగితే హృదయ సంబంధిత రోగాలు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు. గర్భిణీలు కచ్చితంగా దానిమ్మను ఆహారంలో ఓ భాగం చేసుకోవాలి. దీనివల్ల గర్భస్త శిశువు బాగా ఎదుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. దానిమ్మపండులో ఉండే పోషక విలువలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీంతో రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. ఈ కారణంగా గుండె పోటు వచ్చే ప్రమాదం తప్పించుకోవచ్చు. దానిమ్మ పండు కేవలం ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా ఉపయోగపడుతుంది. దానిమ్మ రసంలో ఒక స్పూన్‌ పంచదార, ఒక స్పూన్‌ తేనె వేసిన ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. పైల్స్‌ సమస్యకు కూడా దానిమ్మ మంచి ఔషధంలా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఉదయం దానిమ్మ గింజలకు కొంచెం ఉప్పును కలుపుకొని తింటే.. పైల్స్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.

ఇవి కూడా చదవండి