Mushrooms for Health: మెరుగైన ఆరోగ్యం కావాలనుకుంటే.. తప్పక తినాల్సిన ఆహారం ఇది.. ఇంకెన్నో ప్రయోజనాలు కూడా..

ప్రకృతి నుంచి సహజసిద్ధంగా లభించే ఆహారం ఏదైనా మన ఆరోగ్యానికి శ్రేయస్కరంగానే ఉంటుంది. ఇంకా అటువంటి ఆహారంలో మనకు కావలసిన..

Mushrooms for Health: మెరుగైన ఆరోగ్యం కావాలనుకుంటే.. తప్పక తినాల్సిన ఆహారం ఇది.. ఇంకెన్నో ప్రయోజనాలు కూడా..
Mushrooms for health
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 04, 2023 | 7:20 AM

ప్రకృతి నుంచి సహజసిద్ధంగా లభించే ఆహారం ఏదైనా మన ఆరోగ్యానికి శ్రేయస్కరంగానే ఉంటుంది. ఇంకా అటువంటి ఆహారంలో మనకు కావలసిన పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ప్రకృతిసిద్ధంగా లభించే అలాంటి ఆహారాలలో పుట్టగొడుగులు లేదా మష్రూమ్స్ కూడా ఒకటి. వాటితో చేసిన ఆహారం నాలుకకు రుచిని అందించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పుట్టగొడుగులలో చాలా ముఖ్యమైన, ఉపయోగకరమైన పోషకాలు ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యానికి చాలా అవసరం. పుట్టగొడుగులను ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారని కూడా ప్రచారంలో ఉంది. అయితే పుట్టగొడుగులను తినడం వల్ల మన శరీరంలోని అనేక వ్యాధులు నయమవుతాయి. అవేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. మధుమేహులకు మేలు: వైద్య నిపుణులు పుట్టగొడుగులను మధుమేహ రోగులకు చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఇవి ఫైబర్, అనేక రకాల  విటమిన్లతో పాటు కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. ఇంకా పుట్టగొడుగులలో చక్కెర ఉండకపోవడంతో ఇది శరీరంలో ఇన్సులిన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు నిరభ్యంతరంగా దీనిని తమ ఆహారంలో చేర్చుకోవచ్చు.
  2. రోగనిరోధక శక్తి: పుట్టగొడుగులలో యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని కణాలను కూడా బాగు చేస్తాయి.
  3. బరువు తగ్గడం: పుట్టగొడుగులలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి చాలా సహాయపడతాయి. ఇంకా వీటిని ఆహారంగా తినడం వల్ల చాలా సేపు కడుపు నిండుగా ఉంటుంది కాబట్టి త్వరగా ఆకలి వేయదు. అందుకే బరువు తగ్గడానికి పుట్టగొడుగులను తినమని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
  4. జీర్ణవ్యవస్థ: పుట్టగొడుగులలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
  5. ఇవి కూడా చదవండి
  6. హిమోగ్లోబిన్: మీ శరీరంలో రక్తం సరిపడా లేకుంటే  మీరు పుట్టగొడుగులను తినవచ్చు. పుట్టగొడుగులలో ఫోలిక్ యాసిడ్, ఐరన్ తగిన మోతాదులో లభిస్తాయి. ఇవి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతాయి.
  7. చర్మ  సంరక్షణ: మీ చర్మాన్ని సంరక్షించుకోవాలనుకుంటే పుట్టగొడుగులను మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ గుణాలు మిమ్మల్ని చర్మ సమస్యల నుంచి రక్షిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..