Mint Leaves: అందం, ఆరోగ్యం, సువాసనలు కావాలంటే.. ఈ ఒక్క ఆకుకూరతోనే సాధ్యం.. బోలేడు ప్రయోజనాలు కూడా..

ఆకుకూరలలో పుదీనాది ప్రత్యేక స్థానం. ఎందుకంటే ఈ ఆకు వంటల రుచిని పెంచడమే కాక ఆరోగ్యానికి, అందానికి కూడా ఎంతో మంచిది. సువాసనలను వెదజల్లే పుదీనా ఆకులను..

Mint Leaves: అందం, ఆరోగ్యం, సువాసనలు కావాలంటే.. ఈ ఒక్క ఆకుకూరతోనే సాధ్యం.. బోలేడు ప్రయోజనాలు కూడా..
Mint
Follow us

|

Updated on: Feb 04, 2023 | 8:30 AM

ఆకుకూరలు మన ఆరోగ్యానికి కాపాడడంలో, శరీరానికి కావలసిన పోషకాలను అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇక వీటిని తినడం వల్ల కంటి సమస్యలు, పోషకాహార లోపం వంటి ఆరోగ్య సమస్యలు మన దరి చేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అలాంటి ఆకుకూరలలో పుదీనాది ప్రత్యేక స్థానం. ఎందుకంటే ఈ ఆకు వంటల రుచిని పెంచడమే కాక ఆరోగ్యానికి, అందానికి కూడా ఎంతో మంచిది. సువాసనలను వెదజల్లే పుదీనా ఆకులను ఆయుర్వేద మందుల తయారీలో కూడా వాడుతారు. అంతేకాదు.. కాస్మొటిక్ కంపెనీలు, ఔషధ కంపెనీలు ఈ మొక్కలను పెద్ద సంఖ్యలో సాగు చేయిస్తూ.. ఈ ఆకుల రసాన్ని ఎన్నో క్రీములు, లోషన్లు, మందుల తయారీలో వాడుతున్నాయి. పుదీనా కూరను తినడం ద్వారా అలెర్జీ సమస్యలు తగ్గుతాయి. అస్తమా సమస్య ఉన్నవారికి సైతం ఉపశమనం కలిగిస్తుందని, ఇంకా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. భారతీయులు తమ వంటకాలలో విరివిగా ఉపయోగించే పుదీనాకు నోటి దుర్వాసనను పోగొట్టగల శక్తి కూడా ఉంది. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే ఈ పుదీనా ఆకులలో ఫైబర్, విటమిన్ ఏ, ఐరన్, మాంగనీస్, ఫొలెట్ వంటి పలు రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

పుదీనా ఆకులతో కలిగే ప్రయోజనాలు:

  1. నోటి దుర్వాసనను వదిలించుకోవడానికి చూయింగ్ గమ్ తినేబదులు.. మౌత్ ఫ్రెష్‌నర్‌గా పుదీనా ఆకులు తినడం బెటర్
  2. వాంతులు, వికారం అనిపిస్తున్నప్పుడు రెండు పుదీనా ఆకుల్ని తీసుకొని కొద్దిగా పంచదారతో కలిపి తింటే.. సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
  3. దగ్గు అదేపనిగా వస్తుంటే.. పుదీనా ఆకుల రసం, బ్లాక్ సాల్ట్ కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
  4. కడుపులో నొప్పిగా ఉంటే.. పుదీనా ఆకుల రసం, తేనె కలిపి తాగితే తక్షణ ఫలితం ఉంటుంది.
  5. కడుపులో తిప్పుతూ ఉంటే.. ఓ కప్పు నీటిలో పుదీనా ఆకుల రసం, నిమ్మ రసం కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది.
  6. కలరా సమస్య ఉంటే.. నిమ్మరసం, మామిడి రసం, తేనె కలిపి తాగితే సమస్యకు చెక్ పెట్టినట్లే.
  7. ముఖం కాంతివంతంగా మారాలంటే.. పుదీనా ఆకుల్ని మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. దానిని ముఖానికి పట్టించి.. గంట తర్వాత నీటితే కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
  8. టైఫాయిడ్ నుంచి ఉపశమనం పొందాలంటే.. పుదీనా ఆకులు, తులసి ఆకుల రసం కలిపి తాగాలి.
  9. జలుబుతో ముక్కు కారుతూ ఉంటే.. పుదీనా ఆకుల రసం నాలుగు చుక్కల్ని ముక్కులో వెయ్యాలి. మంచి ఫలితం ఉంటుంది.
  10. ఆహారంతోపాటూ.. పుదీనా ఆకులు, మిరియాల పొడి, నల్ల ద్రాక్ష, జీలకర్ర, సింధు, గసగసాలను కలిపి తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి