World Cancer Day 2023: చాపకింద నీరులా వ్యాపిస్తున్న క్యాన్సర్.. ఇది సోకడానికి గల 6 ప్రధాన కారణాలివే..

ప్రపంచ మానవాళిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో క్యాన్సర్ కూడా ఒకటి. క్యాన్సర్ అనేది శరీరంలోని ఓ అవయవానికి, కణజాలంలో మొదలయ్యే వ్యాధి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా..

World Cancer Day 2023: చాపకింద నీరులా వ్యాపిస్తున్న క్యాన్సర్.. ఇది సోకడానికి గల 6 ప్రధాన కారణాలివే..
World Cancer Day 2023
Follow us

|

Updated on: Feb 04, 2023 | 6:25 AM

ప్రపంచ మానవాళిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో క్యాన్సర్ కూడా ఒకటి. క్యాన్సర్ అనేది శరీరంలోని ఓ అవయవానికి, కణజాలంలో మొదలయ్యే వ్యాధి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌నాల‌ను బ‌లితీసుకుంటున్న వ్యాధుల్లో క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారిది రెండో స్థానం. ఒక్క క‌ణ‌జాలంలో మొదలైన ఈ వ్యాధి అంతకంతకూ పెరుగుతూ శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలను పెంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు వందకు పైగా క్యాన్సర్‌ వ్యాధి రకాలను గుర్తించారు శాస్త్రవేత్తలు. బ్రెస్ట్, లంగ్స్, స్కిన్, త్రోట్, గర్భాశయం, అండాశయం, జీర్ణాశయం, పేగులు, నోటి క్యాన్సర్ ఇలా పలు రకాల క్యాన్సర్లు గుర్తించబడ్డాయి. ఏటా వీటి బారిన పడుతున్న వారి సంఖ్య దాదాపు 13 లక్షలకు పైనే అని ఎన్నో అధ్యయనాలు చెప్తున్నాయి. కొన్ని దశల్లో క్యాన్సర్ ప్రాణాలను సైతం బలి తీసుకుంటూ మానవాళిపై దాడి చేస్తోంది.

ఈ నేపథ్యంలో క్యాన్సర్‌ వ్యాధిపై పరిశోధన, నిరోధక చర్యలు, వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో..ప్రతి ఏటా ఫిబ్రవరి 4న జరుపుకునే వరల్డ్ క్యాన్సర్ డే గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుందాం. క్యాన్సర్ వ్యాధి సోకడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో అతి ముఖ్యమైన కారణం మనిషి లైఫ్ స్టైల్ కాగా తీసుకునే ఆహారం లేదా పాటించే ఆహారపు అలవాట్లు మరో కారణం. ఇవే కాకుండా ఇంకెన్నో కారణాలు క్యాన్సర్ వ్యాధికి కారకాలుగా మారుతున్నాయి. క్యాన్సర్ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే.. అది నయం అవడానికి అంత ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎంత ఆలస్యంగా గుర్తిస్తే.. చికిత్స అంత క్రిటికల్ అవుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో క్యాన్సర్ వ్యాధికి గల ప్రధాన కారణాలు, లేదా ప్రభావితం చేసే అంశాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. స్మోకింగ్: పొగ తాగడం, పొగాకు ఉత్పత్తులు సేవించడం క్యాన్సర్ బారిన పడటానికి ప్రధాన కారణం అవుతున్నాయి. నేరుగా ఊపిరితిత్తుల పని తీరును దెబ్బ తీయడంతో పాటు నోరు, గొంతు భాగాలు చెడిపోయి క్యాన్సర్ సోకే అవకాశాలు అధికంగా ఉంటాయి. అందుకే సాధారణ వ్యక్తుల జీవిత కాలంతో పోలిస్తే.. స్మోకింగ్ చేసే వారి జీవిత కాలం చాలా తక్కువగా ఉంటుందని అనేక అధ్యయనాల్లో తేలింది.
  2. ఒబేసిటీ: స్థూలకాయంతో బాధపడే వారిలో చాలా మంది లావుగా ఉండటం వల్ల తమ అందం దెబ్బతింటోంది అని మాత్రమే ఆందోళన చెందుతుంటారు. ఇంకా లావుగా ఉండటం వల్ల అంద వికారంగా కనిపిస్తున్నాం అనే ఆందోళన వారిని వెంటాడుతుంటుంది. కానీ లావుగా ఉండడం వల్ల కంటికి కనపడని మరో అతి పెద్ద సమస్య ఏంటంటే.. కాలక్రమంలో క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉండటం. లావుగా ఉండే వారిలో హై బిపి, టైప్ 2 డయాబెటిస్ తో పాటు వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం కూడా ఎక్కువే అని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
  3. ఇవి కూడా చదవండి
  4. ఆల్కాహాల్: మోతాదుకు మించి ఆల్కాహాల్ సేవించే అలవాటు ఉన్న వారు క్యాన్సర్ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని పలు పరిశోధనల్లో తేలింది. మద్యం సేవించే అలవాటు ఉన్న వారు స్మోకింగ్ కూడా చేస్తే.. వారికి క్యాన్సర్ సోకే అవకాశాలు అత్యధికం.
  5. ఆహారపు అలవాట్లు: జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, నిల్వ చేసిన మాంసం, గ్యాస్ బబుల్స్ ఉండే డ్రింక్స్ తీసుకోవడం వల్ల పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
  6. ఇన్‌ఫెక్షన్స్: కొన్నిరకాల ఇన్‌ఫెక్షన్స్ శరీరంలో దీర్ఘకాలంపాటు ఉండటం వల్ల అవి క్యాన్సర్‌కి దారి తీసే ప్రమాదం ఉంది.
  7. వంశపారంపర్యం: ఒక తరం నుంచి మరొక తరానికి క్యాన్సర్ సంక్రమించే అవకాశాలు స్వల్పంగా ఉన్నాయి. చాలా క్యాన్సర్లు జన్యుపరంగా వస్తాయి. అంటే మన శరీరం లోపల ఉండే జన్యువుల వైవిధ్యం వల్ల వస్తుంది. కుటుంబంలో తోబుట్టువులు లేదా పిల్లలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది తెలుసుకోవాలంటే బయాప్సీ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. కుటుంబం నుంచి ఒక వ్యక్తి క్యాన్సర్‌తో బాధపడుతున్నప్పుడు కుటుంబ సభ్యులు కౌన్సెలింగ్ తీసుకోవాలి. ఎందుకంటే ఏవైనా లక్షణాలు ఉంటే ముందుగానే గుర్తించి చికిత్స చేయవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..