మిస్ ఇండియాగా లిపి మెష్రమ్.. పోటీదారులను వెనుక్కు నెట్టి అందాల కిరీటం కైవసం

మిస్ ఇండియాగా లిపి మెష్రమ్.. పోటీదారులను వెనుక్కు నెట్టి అందాల కిరీటం కైవసం
Miss India

సూపర్​మోడల్​మిస్​ఇండియా(Miss India) పోటీల్లో ఛత్తీస్​గఢ్​కు చెందిన లిపి మెష్రమ్(Lipi Meshram) విజేతగా నిలిచింది. అంతే కాకుండా టైటిల్ ను సొంతం చేసుకున్న అతి చిన్న వయస్కురాలిగా...

Ganesh Mudavath

|

Mar 07, 2022 | 11:39 AM

సూపర్​మోడల్​మిస్​ఇండియా(Miss India) పోటీల్లో ఛత్తీస్​గఢ్​కు చెందిన లిపి మెష్రమ్(Lipi Meshram) విజేతగా నిలిచింది. అంతే కాకుండా టైటిల్ ను సొంతం చేసుకున్న అతి చిన్న వయస్కురాలిగా అరుదైన ఘనత సాధించింది. గోవా(Goa)లో జరిగిన మిస్​ ఇండియా పోటీల్లో 30మంది యువతులను వెనక్కు నెట్టి మరీ లిపి మెష్రమ్ మిస్ ఇండియాగా నిలిచింది. నక్సలైట్ల చేతిలో లిపి తండ్రి.. కొన్నాళ్ల క్రితమే మరణించారు. అయినా ఏమాత్రం చెలించకుండా మొక్కవోని దీక్షతో పట్టుదలతో ఈ ఘనత సాధించింది. సమస్యలను అధిగమిస్తూనే కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారంతో ఈ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం లిపి మెష్రమ్​ఐఏఎస్​కు సన్నద్ధమవుతోంది. నక్సలైట్ల దాడితో ఎప్పూడూ భీతావహ పరిస్థితులతో ఉండే ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ జిల్లా ముఖచిత్రం క్రమేపీ మారుతోంది. ఇక్కడి యువత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నారు. వినోదం, క్రీడలు, విద్య, ఇతర రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారు. బస్తర్ లోని ఓ కుగ్రామానికి చెందిన యువతి లిపి మెష్రమ్.. అందాల పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. మిస్ ఇండియా గా ఘనత సాధించింది. చిన్న వయసులోనే ఈ టైటిల్ గెలుచుకున్న వారిగా రికార్డు కైవసం చేసుకుంది.

లిపి తండ్రి నక్సలైట్ల బాధితుడు. 2009లో లాండిగూడలోని ఇంటి ముందు లిపి తండ్రిని నక్సలైట్లు కాల్చి చంపారు. తండ్రి మరణానంతరం ఆ కుటుంబానికి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. అయినా వాటికి ఏ మాత్రం బెదరకుండా.. తమ టాలెంట్ నే నమ్ముకుని, పట్టుదలతో లిపి మిస్ ఇండియాగా నిలిచింది. లిపి చదువులో కూడా టాప్, ప్రస్తుతం ఆమె ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతోంది. సినీ ప్రపంచంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోంది. ఆమె సామాజిక కార్యకర్త, గాయని కూడా. స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా లిపి ని బస్తర్ బ్రాండ్ అంబాసిడర్‌గా అధికారులు నియమించారు.

Also Read

Viral Photos: డబుల్ డెక్కర్ బస్సుని ‘రెండు అంతస్తుల ఇల్లు’గా మార్చిన బ్రిటీష్ కపుల్.. లోపల చూస్తే మహాద్భుతం..

చిచ్చు రేపిన మద్యం రక్కసి.. మత్తులో భార్య అనే కనికరం లేకుండా.. ఎంత పని చేశాడంటే

చిచ్చు రేపిన మద్యం రక్కసి.. మత్తులో భార్య అనే కనికరం లేకుండా.. ఎంత పని చేశాడంటే

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu