AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Culture: మగువల మనసు దోచే రంగుల గాజులు.. ఏ రంగు గాజులతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

Indian Culture: హిందూ సంప్రదాయంలో ఆడపిల్లను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకనే అమ్మాయి చేతుల నిండా గాజులు వేసుకుని ఇంట్లో తిరుగుతుంటే.. లక్ష్మీదేవి తిరుగుతున్నట్లే...

Indian Culture: మగువల మనసు దోచే రంగుల గాజులు.. ఏ రంగు గాజులతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?
Diggarent Coloured Bangles
Surya Kala
|

Updated on: Jun 23, 2021 | 2:22 PM

Share

Indian Culture: హిందూ సంప్రదాయంలో ఆడపిల్లను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకనే అమ్మాయి చేతుల నిండా గాజులు వేసుకుని ఇంట్లో తిరుగుతుంటే.. లక్ష్మీదేవి తిరుగుతున్నట్లే ఇంట్లోని పెద్దలు, తల్లిదండ్రులు మురిసిపోతారు. స్త్రీలు గాజులు వేసుకోవటం వెనక అందమే కాకుండా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మన హిందూ ధర్మ శాస్త్రం చెప్పుతుంది.గాజులు వేసుకోవటం వలన ఎలాంటి కీడు జరగకుండా రక్షణగా ఉంటాయి. అందుకనే ఆడపిల్ల పుట్టినప్పుడే దిష్టి తగలకుండా నల్లని గాజులు వేస్తారు. అంతేకాకుండా ఆ గాజుల శబ్ధం పిల్లలకు సంతోషాన్ని కలిగిస్తుంది.

ఇక గాజులను పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకునే అమ్మాయిలు ఇంటి వ్యవహారాలను కూడా జాగ్రత్తగా చక్కదిద్దుకుంటారని నమ్మకం. రంగురంగుల గాజులు మగువలను ఆకట్టుకుంటాయి. ఇప్పుడు ఏ రంగు గాజులను వేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

ఎరుపు రంగు గాజులు శక్తిని,  ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని, పసుపు రంగు గాజులు సంతోషాన్ని, నారింజ రంగు గాజులు విజయాన్ని, నీలిరంగు గాజులు విఙ్ఞానాన్ని,  ఊదారంగు గాజులు స్వేచ్ఛను, తెలుపు రంగు గాజులు ప్రశాంతతను, నలుపు రంగు గాజులు అధికారాన్ని, వెండి గాజులు బలాన్ని, బంగారు గాజులు ఐశ్వర్యాన్ని సూచిస్తాయని మహిళల నమ్మకం.

హిందూ సంప్రదాలో యంలో గాజులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. గాజులు స్త్రీల సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు. మట్టిగాజులు వేసుకోవడం.ఐదవతనాన్ని సూచిస్తుంది.అందుకనే బంగారు గాజులు ఎన్ని వేసుకున్న కనీసం రెండు మట్టిగాజులైనా తప్పనిసరిగా ధరించాలని పెద్దలు చెబుతారు. అంతేకాదు.. మన భారతీయులు గాజులు పగలడాన్ని అమంగళం, అశుభంగా భావిస్తారు.

Also Read: మోనిత మీద అనుమానంతో దీప .. తన పెళ్లి తేదీ చెప్పి.. సౌందర్య ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చిన మోనిత