Perfume: పెర్‌ఫ్యూమ్ కొంటున్నారా..? ముందు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి..
Perfume buying guide: పెర్ఫ్యూమ్ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. ఏదైనా ఫంక్షన్, పార్టీ జరిగినప్పుడు చాలా మంది పెర్ఫ్యూమ్ వాడుతుంటారు. మహిళలు మాత్రం ఈ విషయంలో
Perfume buying guide: పెర్ఫ్యూమ్ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. ఏదైనా ఫంక్షన్, పార్టీ జరిగినప్పుడు చాలా మంది పెర్ఫ్యూమ్ వాడుతుంటారు. మహిళలు మాత్రం ఈ విషయంలో చాలా పర్ఫెక్ట్‌గా ఉంటారు. బెస్ట్ గా ఉన్న వాటినే ఎంపిక చేసుకుంటారు. పెర్ఫ్యూమ్ మనస్సును ఉల్లాసభరితంగా చేస్తుంది. అలాగే వ్యక్తిత్వాన్ని కూడా కాపాడుతుంది. అందే ఎక్కువ సమయం ఘుమఘుమలాడే పెర్ఫ్యూమ్స్ అంటే చాలా మందికి ఇష్టం. కానీ ఏ పెర్ఫ్యూమ్ దీర్ఘకాలం ఉంటుంది. ఏది ఉండదనేది ఎలా అర్థం చేసుకోవాలి. మీకు దాని గురించి తెలియక.. సువాసన చూసి మీరు కొనుగోలు చేస్తుంటే.. మీరు మోసపోయే అవకాశం ఉంది. అనేక సార్లు ఖరీదైన పెర్ఫ్యూమ్ కొనుగోలు చేసినప్పటికీ.. ఇది దీర్ఘకాలం ఉండే పెర్ఫ్యూమా.. కాదా అన్నది చూసుకోవడం ముఖ్యం. ఇలాంటి పరిస్థితిలో పర్ఫ్యూమ్ ఏది మంచిగా ఉంటుందో తెలుసుకోవాలంటే..? ఈ చిట్కాలను అనుసరించండి..
పెర్‌ఫ్యూమ్ కొనుగోలు చేసేటప్పుడు ఇది గమనించండి..
మీరు పెర్ఫ్యూమ్‌ను కొనుగోలు చేసినప్పుడల్లా.. దాని బాటిల్‌పై ఉన్న స్థాయిని ఖచ్చితంగా తనిఖీ చేయండి. ఫర్ఫ్యూమ్ బాటిల్‌పై EDP – EDT వంటి స్థాయి పదాలు ఉంటాయి. మీరు దీర్ఘకాలం ఉండే పెర్ఫ్యూమ్ కొనాలనుకుంటే EDP పెర్ఫ్యూమ్ కొనండి.
ఇలా పరీక్షించండి
పెర్ఫ్యూమ్ కొనుగోలు చేసేటప్పుడు.. మీ చర్మంపై ఎక్కడో ఒకచోట స్ప్రే చేయండి. స్ప్రే తర్వాత సుమారు పది నిమిషాల పాటు మిగిలిన షాపింగ్ చేసుకోండి. అనంతరం స్ర్పే చేసిన చోట వాసన వస్తే అది దీర్ఘకాలం ఉంటుందని అర్థం.
ఈ శరీర భాగాలపై తనిఖీ చేయండి..
పెర్ఫ్యూమ్ సువాసనను తనిఖీ చేస్తున్నప్పుడు.. మీరు దానిని మణికట్టు మీద మాత్రమే స్ప్రే చేయొద్దు. అరచేతి మీద, మెడ లేదా మోచేయి చుట్టూ స్ప్రే చేసి తనిఖీ చేయవచ్చు. బట్టలపై స్ప్రే చేసి దానిని ఎప్పుడూ పరీక్షించవద్దు. ఇది కాకుండా ఎల్లప్పుడూ మంచి బ్రాండ్ పెర్ఫ్యూమ్ మాత్రమే కొనడం మంచిది.
ప్యాచ్ టెస్ట్ చేయండి
కొన్ని పెర్ఫ్యూమ్‌లు మన చర్మనికి మంచిదికాదు. వాటిని ఉపయోగించడం అలెర్జీలకు దారితీస్తుంది. ఈ సమస్యను నివారించడానికి ముందుగా పెర్ఫ్యూమ్ ప్యాచ్ టెస్ట్ చేయండి. ఇదేకాకుండా బాగా సువాసన వచ్చే పెర్ఫ్యూమ్ అలెర్జీకి దారితీస్తుంది. అలాంటి పెర్ఫ్యూమ్ కొనకండి. పెర్ఫ్యూమ్‌ను పరీక్షించేటప్పుడు ఎప్పుడూ రుద్దకండి. రుద్దడం వల్ల దద్దుర్లు, మంట వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
Also Read: