AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Food Tips: వీటిని కలిపి తింటే ఎన్నో సూపర్ బెనిఫిట్స్.. ప్రయోజనాలు తెలిస్తే బిత్తరపోవాల్సిందే.!

'ఆరోగ్యమే మహాభాగ్యం' ఇది జగమెరిగిన సత్యం. మనం ఎలప్పుడూ ఆరోగ్యకరంగా.. ఉత్సాహంగా ఉండాలంటే.. మనం తీసుకునే ఆహరం...

Food Tips: వీటిని కలిపి తింటే ఎన్నో సూపర్ బెనిఫిట్స్.. ప్రయోజనాలు తెలిస్తే బిత్తరపోవాల్సిందే.!
Health
Ravi Kiran
|

Updated on: Mar 25, 2022 | 11:53 AM

Share

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ ఇది జగమెరిగిన సత్యం. మనం ఎలప్పుడూ ఆరోగ్యంగా.. ఉత్సాహంగా ఉండాలంటే.. మనం తీసుకునే ఆహరం పౌష్టికాహారం అయి ఉండాలి. ప్రోటీన్స్, ఖనిజాలు, విటమిన్స్ పుష్కలంగా ఉండే ఆహార పదార్ధాలను తీసుకోవడం వల్ల ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాం. ఇదిలా ఉంటే.. కొందరు కొత్త రుచుల కోసం రెండు ఆహార పదార్ధాలను కలిపి తింటుంటారు. ఇలా రెండు రకాల ఆహార పదార్ధాలు కలిపి తీసుకుంటే రుచి సంగతి పక్కన పెడితే.. ఆ ఫుడ్ కాంబినేషన్స్ బెడిసికొట్టి లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తడం ఖాయం. అలా కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే ఫుడ్ కాంబినేషన్స్ ఏంటో తెలుసుకుందామా.!

నల్లటి ద్రాక్షలు, ఉల్లిపాయ కలయిక.. బ్లడ్ ప్రెజర్ లెవెల్స్‌ను తగ్గిస్తుందని మీరెప్పుడైనా అనుకున్నారా.? రోబ్ హోబ్సన్ అనే డైట్ ఎక్స్‌పర్ట్.. దీనికి అవునని సమాధానం ఇస్తున్నారు. ఇవన్నీ రెండు కలిపి తీసుకుంటే రక్తపోటు(బీపీ) తగ్గుతుందని చెబుతున్నారు. మీరు చేపల కూరను చాలాసార్లు రుచి చూసి ఉంటారు.. అయితే నూనెలో వేయించిన చేపతో పసుపు కలయిక యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటుంది. అలాగే పెరుగుతో పాటు అరటిపండు తినడం వల్ల ఎముకలు బలపడతాయి. ఈ కలయిక పేగుల్లో ఏర్పడే బ్యాక్టీరియాను కూడా నివారిస్తుంది.

టమాటోలు, మిరపకాయలలో ఉండే విటమిన్-ఏ ఆలివ్ ఆయిల్‌లో పుష్కలంగా దొరుకుతుంది. ఇది కళ్లకు, చర్మానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. నల్ల ద్రాక్షలో కాటెచిన్స్ అనే పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండె సంబంధిత రోగాలు, క్యాన్సర్, నరాల సంబంధిత రుగ్మతుల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. నల్ల ద్రాక్షను ఉల్లిపాయలతో కలిపి తింటే రక్తం గడ్డకట్టే సమస్య తగ్గడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు.

మరోవైపు వెల్లుల్లి, తేనె కలిపి తినడం వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనాన్ని పొందొచ్చు. అలాగే బాదంపప్పుతో బెర్రీలు తినడం వల్ల గుండె జబ్బులను నివారించవచ్చు. ఎలప్పుడూ ఈ ఫుడ్ కాంబినేషన్స్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని డాక్టర్స్ స్పష్టం చేస్తున్నారు.

Note: ఇందులో చెప్పిన చిట్కాలు, సూచనలు కేవలం అవగాహన కోసమే.. అవసరంమైనవారు వైద్య సలహాలు సూచనల మేరకు తీసుకోవాల్సి ఉంటుంది.