Barley Water: వేసవి తాపాన్ని తీర్చే చౌకైన సహజ పానీయం బార్లీ నీరు.. కిడ్నీ రాళ్లతో బాధపడేవారికి మంచి ఉపశమనం..
Barley Water: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఎండవేడికి.. దాహం కూడా ఎక్కువగా వేస్తుంది. దీంతో చాలామంది శీతల పానీయాల (Cool Drinks)..
Barley Water: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఎండవేడికి.. దాహం కూడా ఎక్కువగా వేస్తుంది. దీంతో చాలామంది శీతల పానీయాల (Cool Drinks) వైపు దృష్టి సరిస్తుంటారు. కానీ మనకు ప్రకృతి ఇచ్చిన సహజ పానీయాలను రోజు తాగితే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అంతేకాదు ఇవి చౌకగా కూడా దొరుకుతాయి. మనకు ప్రకృతి ఇచ్చిన వాటిల్లో ఒకటి బార్లీ. దీనిలో బి-విటమిన్లు, పీచు పదార్థాలు వంటివి అత్యధిక భాగంపై పొట్టులోనే ఉంటాయి. కనుక బి విటమిన్ లోపంతో బాధపడేవారు ఈ బార్లీ గింజలను పొట్టుతో సహా వాడడం వలన మేలు జరుగుతుంది. బార్లీలో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు సమృద్దిగా ఉన్నాయి. కనుక మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి. ఈరోజు బార్లీ నీరు తయారీ.. బార్లీ నీరు తాగడం వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
- మారుతున్న కాలంతో పాటు జీవన శైలిలో కూడా అనేక మార్పులు వచ్చాయి. తినే తిండి.. జీవించే విధానంలో అన్నీ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఎక్కువమంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నారు. ఈ సమస్యను సమర్ధవంతంగా నివారిస్తుంది బార్లీ నీరు.
- కిడ్నీలో రాళ్లు ఉన్నవారు విపరీతమైన బాధపడతారు. అయితే కిడ్నీలో రాళ్ళు చిన్నగా ఉంటే మాత్రం ఆ బాధను నివారించుకోవడానికి ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి.
- బార్లీ నీటిని రోజులో రెండు సార్లు తాగితే కిడ్నీ ఇన్ ఫెక్షన్ చాలా వరకూ అదుపులోకి వస్తుంది.
- ఈ బార్లీ నీటిని రోజులో రెండు సార్లు తీసుకుంటే కిడ్నీలో ఉన్న చిన్న చిన్న రాళ్ళు అన్నీ కరిగిపోతాయి.
- వేసవిలో వడదెబ్బ నుండి ఉపశమనం కలుగుతుంది.
- నీరసం అలసటకు గురైన వారికి బార్లీ నీరు తక్షణ శక్తినిస్తుంది.
- అధిక బరువు, శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది.
బార్లీ నీరు తయారీ: బార్లీ గింజలు చాలా చవకగా లభిస్తాయి. స్టౌ మీద దళసరి గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీటిని పోసి రెండు స్పూన్ల బార్లీ గింజల పొడి వేసి.. ఆ నీటిని 10 నిమిషాలు మరిగించాలీ. అనంతరం ఆ నీటిని ఫిల్టర్ చేసి.. గోరువెచ్చగా ఉన్నప్పుడు నిమ్మరసం పిండుకుని తాగాలి.
ఇలా రోజుకు రెండు సార్లు రెండు గ్లాసులు బార్లీ నీరు తాగితే కిడ్నీ రాళ్ళతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది. అయితే కిడ్నీల్లో రాళ్ళు పెద్దగా ఉంటే మాత్రం డాక్టర్ ఇచ్చిన మందులను వాడుతూ బార్లీ నీటిని తాగితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.
Note: ఇందులో చెప్పిన చిట్కాలు, సూచనలు కేవలం అవగాహన కోసమే.. అవసరంమైనవారు వైద్య సలహాలు సూచనల మేరకు తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read:Viral Video: మూడు చిరుతల మధ్య .. చిరుతను కౌగలించుకుని హాయిగా దుప్పటి కప్పుకుని నిద్రపోతున్న వ్యక్తి