- Telugu News Photo Gallery Does stress increase sugar levels? What the experts say, Check Here is Details
Stress for Diabetes: ఒత్తిడి వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయా? నిపుణులు ఏం అంటున్నారంటే..
ప్రస్తుత కాలంలో ఒత్తిడి కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒత్తిడిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక దీర్ఘకాలిక సమస్యలను తెచ్చుకుంటున్నారు. ఒత్తిడి ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ కూడా పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..
Updated on: Nov 12, 2024 | 7:32 PM

ప్రస్తుత కాలంలో ఒత్తిడి అనేది విపరీతంగా ఎక్కువ అవుతుంది. ఒత్తిడిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక దీర్ఘకాలిక సమస్యల ముప్పు ఎక్కువ అవుతుంది. ప్రస్తుత కాలంలో ఉన్న ఆఫీసుల పనులు, ఇంట్లోని ఆర్థిక సమస్యల కారణంగా ఒత్తిడిని ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ ఒత్తిడి.. షుగర్ వ్యాధిపై ప్రభాం చూపుతుంది.

స్ట్రెస్ కారణంగా షుగర్ లెవల్స్ కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడికి గురైనప్పుడు.. శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేందుకు దారి తీస్తుంది.

ఒత్తిడికి గురైనప్పుడు గ్లూకాగన్ అనే హార్మోన్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఇది కాలేయం నుండి గ్లూకోజ్‌ని రిలీజ్‌కు ప్రేరేపిస్తుంది. ఈ కారణంగా కూడా రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి.

ఒత్తిడి, ఆందోళన కారణంగా శరీరంలోని ఇన్సులిన్ కూడా సరిగా స్పందించలేదు. ఈ క్రమంలో కూడా స్ట్రెస్ అనేది పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా మందుల ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది.

షుగర్ వ్యాధితో ఉన్నవారు ఒత్తిడిని ఎక్కువగా తీసుకోకూడదు. దీని వల్ల మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఒక సమయంలో మందులు కూడా సరైన ప్రభావం చూపించ లేకపోవచ్చు. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)





























