యువతలో పెరుగుతున్న ఫ్యాటీ లివర్ సమస్యలు.. కారణం ఇదే!

12 November 2024

TV9 Telugu

TV9 Telugu

మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో లివర్‌ ఒకటి. ఇది రక్తంలోంచి విషతుల్యాలను వేరు చేయడం నుంచి తిన్న ఆహారం జీర్ణం కావటానికి, రక్తంలో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉండటానికీ సాయం చేస్తుంది

TV9 Telugu

ఇలా ఎన్నెన్నో పనుల్లో పాలు పంచుకుంటుంది. ఇలాంటి కాలేయానికి ఇప్పుడు కొవ్వు పెద్ద సమస్యగా మారుతోంది. ప్రస్తుతం ఎంతోమంది ఫ్యాటీ లివర్‌ సమస్యతో బాధ పడుతున్నారు

TV9 Telugu

కాలేయ కణాల్లో ఎంతో కొంత కొవ్వు ఉండటం మామూలే. శరీరంలో మిగతా అవయవాల మాదిరిగానే కాలేయంలోనూ కొవ్వు పోగుపడొచ్చు. కొంతవరకు ఉంటే ఇబ్బందేమీ ఉండదు గానీ మితిమీరితే కాలేయాన్ని దెబ్బతీస్తుంది

TV9 Telugu

ఇందుకు ప్రధాన కారణం మన ఆహార అలవాట్లు. అలాగే కొన్నిరకాల జబ్బులు, జన్యువులు, జీర్ణకోశ వ్యవస్థ.. ఇవన్నీ కాలేయానికి కొవ్వు పట్టే సమస్య తలెత్తటంలో పాలు పంచుకునేవే

TV9 Telugu

దీన్నే నాన్‌ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌.. అంటే మద్యంతో సంబంధం లేని జబ్బు అనీ అంటారు. ఇదో దీర్ఘకాల సమస్య. మనదేశంలో 9% నుంచి 32% మంది దీంతో బాధపడుతున్నారని అంచనా

TV9 Telugu

ఫ్యాటీ లివర్ సమస్యలకు కారణమయ్యే ఆహారాల్లో.. మఫిన్లు, కేకులు, పేస్ట్రీలు, కుకీలు వంటి బేకింగ్‌ ఆహారాలు ముఖ్యమైనవి. ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. బ్రెడ్‌లో వెన్న తింటే.. అందులోని ట్రాన్స్ ఫ్యాట్  రెగ్యులర్ గా శరీరంలోకి వెళితే ఫ్యాటీ లివర్ సమస్యలు పెరుగుతాయి

TV9 Telugu

సోడా, శీతల పానీయాలు ఎక్కువగా తీసుకునే అలవాటు కూడా హానికరం. ఆల్కహాల్ తీసుకోకపోయినా.. క్రమం తప్పకుండా శీతల పానీయాలు తాగే వారికి ఫ్యాటీ లివర్ సమస్య పొంచి ఉంటుంది

TV9 Telugu

మైదా పిండితో చేసిన ఆహారాలన్నీ కాలేయ వ్యాధులకు కారణమవుతాయి. అలాగే వేయించిన ఆహారాలు, ఆయిల్-స్పైసీ ఫుడ్స్, చాప్-కట్లెట్స్, స్వీట్లు, క్యాండీలు, చాక్లెట్లు, కేకులు వంటి ఆహారాల్లో కొవ్వు పుష్కలంగా ఉంటుంది. వీటివల్ల కాలేయ వ్యాధులు వస్తాయి