Hair Fall Tips: జుట్టు రాలిపోతుందా..! ఈ సింపుల్ చిట్కా ఫాలో అవ్వండి.. ఒత్తైన అందమైన జుట్టు మీ సొంతం

Hair Fall Tips: వాతావరణ కాలుష్యం, తినే ఆహారంలో పోషకాలు లోపం, పనిలో ఒత్తిడి, మానసిక ఆందోళన ఇవన్నీ కలిసి.. జుట్టు రాలిపోవడం సర్వసాధారణం అయిపొయింది...

Hair Fall Tips: జుట్టు రాలిపోతుందా..! ఈ సింపుల్ చిట్కా ఫాలో అవ్వండి.. ఒత్తైన అందమైన జుట్టు మీ సొంతం
Hair Fall Tips
Follow us

|

Updated on: Apr 04, 2021 | 6:15 PM

Hair Fall Tips: వాతావరణ కాలుష్యం, తినే ఆహారంలో పోషకాలు లోపం, పనిలో ఒత్తిడి, మానసిక ఆందోళన ఇవన్నీ కలిసి.. జుట్టు రాలిపోవడం సర్వసాధారణం అయిపొయింది.

స్త్రీ, పురుషులు అనే బేధం లేకుండా.. చాలా మంది బాధపడుతున్నారు. ఇక చుండ్రు కూడా జుట్టు రాలిపోవడానికి ఒక కారణంగా చెప్పొవచ్చు. జుట్టు రాలే సమస్య రాగానే కంగారు పడుతూ.. మార్కెట్లో దొరికే అనేక రకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. వాటి కోసం వేలకొద్ది డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా తక్కువ ఖర్చుతో ఇంటి చిట్కాల ద్వారా జుట్టు రాలే సమస్య ను తగ్గించుకోవచ్చు ఇప్పుడు చెప్పే చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో కరివేపాకు,ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ కాఫీ పొడి వేసి 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి. బాగా మరిగాక ఆ నీటిని వడకట్టి దానిలో ఒక స్పూన్ కొబ్బరినూనే వేసి బాగా కలిపి తలకు బాగా పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

Also Read: మెసేజ్‌‌తో కూడిన ఫన్నీ వీడియో.. రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్న యువకుడు రైలుకు ఎదురెళ్ళిన వైనం

నోటిపూతతో బాధపడుతున్నారా..? నివారణకు అద్భుతమైన చిట్కాలు..