మ్యారెజ్ సీజన్ వచ్చేస్తుంది… ఈ సమ్మర్లో ఇబ్బంది కలగకుండా డ్రెస్సింగ్ స్టైల్ కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
వివాహం సమయంలో ఎంతో సందడిగా ఉండాలనుకుంటారు. కానీ కొన్న సందర్భాల్లో చాలా మంది వారి డ్రెస్సింగ్ వల్ల ఇబ్బంది పడుతుంటారు.
వివాహం సమయంలో ఎంతో సందడిగా ఉండాలనుకుంటారు. కానీ కొన్న సందర్భాల్లో చాలా మంది వారి డ్రెస్సింగ్ వల్ల ఇబ్బంది పడుతుంటారు. ఇక ముఖ్యంగా అమ్మాయిలు ఈ పెళ్లి తర్వాత వారి అత్తవారింట్లో ఉండేప్పుడు చాలా మంది సింపుల్ స్టైలిష్‌గా ఉండడమే కాకుండా.. కంఫర్ట్‌బుల్‌గా ఉండాలనుకుంటారు. అలా అయోమయంలో ఉన్న వారికి ఈ సమ్మర్లో వచ్చే మ్యారెజ్ సీజన్లో అందంగా.. కంఫర్ట్ బుల్గా ఉండేలా ఎలాంటి దుస్తులను ఎంచుకోవాలో మీకోసం కొన్ని టిప్స్. అవెంటో తెలుసుకుందామా.
— ముఖ్యంగా పెళ్ళిలలో మీరు సింపుల్, స్టైలిష్ గా కనిపించాలనుకుంటే.. అందుకోసం ఒక కుర్తా ఎంచుకోవడం మంచిది. ముఖ్యంగా సిల్క్ దుప్పట్టతోపాటు, ఎక్కువగా ఎంబ్రాయిడరీ చేసిన కుర్తా, షరారా కాంబో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అలాగే మీరు చాలా కంఫర్ట్‌గా ఉంటారు.
–మీకు చీర కట్టుకోవడం రాకపోయినట్లైయితే.. ఎక్కువగా హెవీ వర్క్ ఉన్నవి ఎంచుకోకపోవడం మంచిది. అలాగ కాకుండా.. వర్క్ లేకుండా.. సన్నని చీరలను ఎంచుకోవడం మంచిది. వీటిని మీరు ఈజీగా క్యారీ చేయవచ్చు. ఇందుకోసం శాటిన్ చీరలను సెలక్ట్ చేసుకోండి. అలాగే స్టోన్ బ్లౌజ్ ధరించడం వలన మరింత అందంగా కనిపిస్తారు. వీటిలో మీరు స్లిమ్ గా కూడా కనిపిస్తారు.
— ఇక సంప్రదాయంగా కనిపించాలనుకుంటే.. మీకు ఎక్కువగా ప్రింటెంట్ లెహంగాలను ఎంచుకోవడం ఉత్తమం. సిల్క్, బ్లాక్ ప్రింటెడ్ లెహంగాలు, హ్యండ్ వర్క్ ఉన్నవి ఎంచుకోవాలి. అద్దాలు, బ్లా్క్ ప్రింట్స్ ఉండేవి అందంగా కనిపిస్తాయి. అలాగే సిల్క్ బ్లౌజ్, చోలీతో పాటు బ్లాక్ ప్రింటెడ్ లెహెంగా.. నెట్ దుపట్టా ధరిస్తే.. మీరు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు.
— పెళ్లి వేడుకలలో మిర్రర్ వర్క్ బాందీనీ లెహంగాను ఎంచుకోవడం బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా జోధ్ పూర్ లెహంగాలను సెలక్ట్ చేసుకోవడం మంచిది. మిర్రర్ వర్క్ బ్లౌజ్, జార్జెట్ దుపట్టాను జతచేయడం వలన మరింత అందంగా కనిపిస్తారు.
Ram Charan: రామ్ చరణ్, శంకర్ ప్రాజెక్ట్ క్రేజీ అప్డేట్.. మరోసారి మెగా కాంబో రిపీట్ కాబోతుందా ?