AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Capsicum Farming: రైతు ఆర్ధికంగా లాభాలు అందుకోవాలంటే కాప్సికం పంట మేలైన ఎంపిక.. లక్షల్లో ఆదాయం..

సాధారణ కూరగాయల్లాగే క్యాప్సికం సాగు కూడా అన్ని రకాల వాతావరణం అనుకూలం. క్యాప్సికం మంచి దిగుబడి రావడంతో మంచి ఆదాయం లభిస్తుంది.

Capsicum Farming: రైతు ఆర్ధికంగా లాభాలు అందుకోవాలంటే కాప్సికం పంట మేలైన ఎంపిక.. లక్షల్లో ఆదాయం..
Capsicum Cultivating
Surya Kala
|

Updated on: Aug 06, 2022 | 8:37 PM

Share

Capsicum Farming:  అన్నదాత ఆర్ధికంగా లాభాలను అందుకోవాలంటే.. కాలానికి, మార్కెట్ కు అనుగుణంగా వ్యవసాయాన్ని చేయాల్సి ఉంటుంది. ప్రజల ఆహార అభిరుచులకు అనుగుణంగా కూరగాయల పంటలను..ముఖ్యంగా నిల్వ ఉండే కూరగాయలను పంటగా ఎంచుకోవడం ఉత్తమ ఫలితాలను పొందవచ్చు అని కొంతమంది రైతులు నిరూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యాప్సికం ధర మార్కెట్‌లో ఇతర కూరగాయల కంటే మెరుగ్గా ఉంది.  దీంతో రైతుల బాగానే సంపాదిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో క్యాప్సికమ్ సాగు ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతున్న చాలా మంది రైతులు ఉన్నారు. ఇక్కడి రైతులు ఉత్పత్తి చేసే క్యాప్సికం ఢిల్లీ, ఆగ్రాకు రవాణా అవుతుంది. క్యాప్సికం మంచి లాభదాయకమైన వ్యవసాయం అని పలువురు రైతులు చెప్పారు. ఈ కూరగాయ సాగుతో రైతులకు ఆదాయం పెరుగుతుంది.

సాధారణ కూరగాయల్లాగే క్యాప్సికం సాగు కూడా అన్ని రకాల వాతావరణం అనుకూలం. క్యాప్సికం మంచి దిగుబడి రావడంతో మంచి ఆదాయం లభిస్తుంది. ఒక భూమిలో కలుపు తీసి, కలుపు నివారణకు మందులు, యాంటీ బాక్టీరియల్ మందులు పిచికారీ చేసి క్యాప్సికం సాగు ప్రారంభించారు.

బిందు సేద్యం ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు క్యాప్సికం సాగుని బిందు పద్ధతిలో సేద్యం చేయడం మేలైన ఫలితాలను ఇస్తుంది. వ్యవసాయానికి ఇది ఉత్తమమైన నీటిపారుదల పద్ధతి. సంప్రదాయ పద్ధతిలో సాగు చేస్తున్న రైతులు మెల్లగా బయటకు వస్తున్నారు. బిందు పద్ధతిలో సేద్యం నీటిని ఆదా చేయడంతోపాటు అవసరాన్ని బట్టి నీటిని వాడుకోవచ్చు. ఖర్చు ఆదా అవుతుంది.  ఉత్పత్తి బాగుంటుంది. ఈ పద్ధతి ద్వారా మనం ఎరువును కూడా సరైన పద్ధతిలో వాడుకోవచ్చు. ఈ పద్ధతిలో సేద్యానికి ప్రభుత్వం భారీ రాయితీలు ఇస్తోంది.

ఇవి కూడా చదవండి

కేవలం 75 రోజుల్లోనే కాప్సికం దిగుబడి  పొలంలో కలుపు నివారించి.. తగిన రసాయనాలతో సిద్ధం చేసిన అనంతరం.. సిద్ధంగా ఉన్న క్యాప్సికమ్ మొక్కలను సరైన దూరంలో రైతులు నాటుతారు. మొక్క పెరుగుదలకు సరైన ఎరువు, నీరు , పురుగుమందులను పిచికారీ చేస్తే.. పంట దిగుబడి అత్యధికంగా ఉంటుంది. క్యాప్సికం సాగుకు నేల pH విలువ 6 ఉండాలి. క్యాప్సికమ్ మొక్క 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తట్టుకోగలదు. మొక్క నాటిన 75 రోజుల తర్వాత దిగుబడిని ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఒక హెక్టారులో దాదాపు 300 క్వింటాళ్ల క్యాప్సికం ఉత్పత్తి అవుతుంది.

ప్రస్తుతానికి ధర ఎంత ఉందంటే:  క్యాప్సికం ఉత్పత్తి కోసం సోలన్ ఔదార్య జాతుల విత్తనాలను రైతులు ఉపయోగిస్తున్నారు. ఈ మొక్క ఎరుపుగా పెరుగుతుంది. అంతేకాదు ఈ మొక్కకు కాసిన కాప్సికం త్వరగా కుళ్లిపోదు. ప్రస్తుతం మార్కెట్‌లో 100 కిలోల క్యాప్సికం విక్రయం చేస్తున్నారు. రైతులు కాప్సికం అమ్మకంతో లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ దిగుబడి దాదాపు 6 నెలల పాటు కొనసాగుతుంది. మొక్కల పెంపకంలో ప్రతి నెలా కలుపు తీయాల్సి ఉంటుంది.  దీంతో మొక్కల్లో పచ్చదనం కనిపిస్తుంది. కలుపు మొక్కలను నియంత్రించడం ద్వారా పండ్లు, అందం చెక్కుచెదరకుండా ఉంటాయి.

దిగుబడి ఎంత మొక్కల ఆకులపై రంధ్రాలు కనిపించినప్పుడు.. వెంటనే చెట్లపై తగిన మొత్తంలో సల్ఫర్‌ను పిచికారీ చేయాలి. మొజాయిక్ వ్యాధి, ఉత్త వ్యాధి,  కాండం తొలిచే పురుగు వంటి శిలీంధ్ర తెగుళ్ల వల్ల పంట ఎక్కువగా దెబ్బతింటుంది. సకాలంలో సంరక్షణతో మొక్క ఆనందం చెక్కుచెదరకుండా ఉంటుంది. సుమారు 300 క్వింటాళ్ల పంట దిగుబడి వచ్చినట్లు రైతు తెలిపారు. అయితే వాతావరణం అనుకూలిస్తే 500 క్వింటాళ్ల దిగుబడి లభిస్తుంది.

కూరగాయలు పండించే వారికి ఎంత సబ్సిడీ వస్తుందంటే కూరగాయలు సాగు చేస్తున్న రైతులకు గ్రాంట్లు, విత్తనాలు అందజేస్తున్నట్లు హర్దోయ్ జిల్లా ఉద్యానశాఖ అధికారి సురేష్ కుమార్ తెలిపారు. కూరగాయల పంటలు పండించే రైతులకు ఉద్యానవన శాఖ ద్వారా 70 శాతం వరకు సబ్సిడీ ఇస్తారు. ఒకటిన్నర హెక్టార్లలో క్యాప్సికమ్ ఉత్పత్తి చేసే రైతులకు సుమారు 37500 గ్రాంట్ ఇవ్వబడుతుంది, ఇది రైతు సాగుకు సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..