విమానంలో మొదటిసారి వెళ్తున్నారా ?? ఈ టిప్స్ మీ కోసమే
TV9 Telugu
Pic credit - Pixabay
ఫ్లైట్ జర్నీ ఎవరు ఇష్టపడరు, చాలా మందికి విమానంలో ప్రయాణించాలని ఉంటుంది. కానీ కొంత మంది మాత్రమే ఎక్కువగా ఫ్లైట్ జర్నీ చేస్తుంటారు.
అయితే ఎప్పుడూ రోడ్ జర్నీ చేసిన వారు ఫస్టైమ్ విమానంలో ప్రయాణించాల్సి వస్తే, వారికి ఉండే భయం అంతా ఇంతా ఉండదు.
గుండెలో దడగా భయం భయంగా . ఎక్కువ టెన్షన్‌గా ఫీల్ అవుతుంటారు. కాగా, అలాంటి వారికోసమే ఈ ముఖ్యమైన సమాచారం.
మీరు విమానంలో మొదటిసారిగా ప్రయాణిస్తున్నట్లైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జర్నీ చేయడానికి ఒకరోజు ముందే, మీ ఫ్లైట్ డిటేయిల్స్‌ను ఆన్ లైన్‌లో చెక్ చేసుకోవాలి. అలాగే రెండు లేదా మూడు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలి.
ఎందుకంటే సెక్యూరిటీ చెక్, స్క్రీనింగ్, డ్యాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవడానికి కాస్త సమయం పడుతుంది. అలాగే బ్యాగేజ్ డ్రాప్ ఆఫ్ చేసుకోవాలి.
విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా, రిలాక్స్‌గా ఉండాలి. దీని వలన ఎలాంటి సమస్యలు తలెత్తవు.
అంతే కాకుండా కొందరు ప్రయాణం సాఫీగా సాగుతుందో లేదో అని టెన్షన్ పడుతూ, జర్నీని ఎంజాయ్ చేయరు. కానీ అలా కాకుండా, స్నాక్స్ తింటూ, మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ జర్నీ చేయాలి.