Beauty Tips: ముల్తానీ మట్టి vs చందనం.. ఫేస్ కి ఏది మంచిది..?
చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుకోవాలంటే సహజసిద్ధమైన చిట్కాలు ఉపయోగించడం ఉత్తమం. ముల్తానీ మట్టి, చందనం రెండూ ముఖ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఏది ఉత్తమ ఫలితాలను అందిస్తుందో తెలుసుకోవడం అవసరం. మీ చర్మ తత్వానికి అనుగుణంగా ఏది ఉపయోగించాలి అనేదాన్ని ఇప్పుడు తెలుసుకోండి.

ముఖం ఆరోగ్యంగా, కాంతివంతంగా కనిపించాలంటే సరైన స్కిన్ కేర్ అనుసరించాలి. సహజసిద్ధమైన చర్మ సంరక్షణలో ముల్తానీ మట్టి, చందనం ముఖ్యమైనవి. ఇవి శతాబ్దాలుగా అందాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తున్నారు. అయితే ఈ రెండింటిలో ఏది మంచి ఫలితాలను ఇస్తుందో తెలుసుకోవాలంటే వాటి ప్రయోజనాలను ముందుగా తెలుసుకుందాం.
ముల్తానీ మట్టి, చందనం
ముఖ చర్మాన్ని శుభ్రంగా ఉంచే రెండు అత్యుత్తమమైన పదార్థాల్లో ముల్తానీ మట్టి, చందనం ముందుంటాయి. కొందరు చందనం పొడి కలిపిన ఫేస్ ప్యాక్ వాడుతారు. మరికొందరు ముల్తానీ మట్టిని ముఖానికి అప్లై చేస్తారు. అయితే ఆయిల్ స్కిన్, పొడి చర్మం ఉన్నవారికి ఏది అనువైనదో చూసి వాడాలి.
జిడ్డు చర్మం
చర్మంపై అధిక నూనె ఏర్పడి సమస్యలు ఎదుర్కొనే వారు ముల్తానీ మట్టి లేదా చందనం ఉపయోగించుకోవచ్చు. ఇవి చర్మంలో ఉండే అదనపు నూనెను తగ్గించి తాజాదనాన్ని అందిస్తాయి. ముల్తానీ మట్టి ఆయిల్ స్కిన్ కోసం చాలా బాగుంటుంది. ఇది ముఖంపై మెరుపుని తెచ్చి మృదువుగా మారుస్తుంది.
పొడి చర్మం
పొడి చర్మం ఉన్నవారు ముల్తానీ మట్టిని కాస్తా తేమ కలిగించే పదార్థాలతో కలిపి వాడాలి. అయితే పూర్తిగా పొడిగా మారకుండా ఉండటానికి చందనం కూడా మంచి ఎంపిక. ఇది చర్మానికి తేమను అందించి మెరిసే తాజాదనాన్ని ఇచ్చేలా పనిచేస్తుంది.
ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్
పొడి చర్మం ఉన్నవారు ముల్తానీ మట్టిని పాలు, పెరుగు లేదా తేనెతో కలిపి ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించాలి. ఈ పదార్థాల్లో తేమను అందించే గుణాలు ఉండటంతో చర్మాన్ని మృదువుగా ఉంచడమే కాకుండా మాయిశ్చరైజింగ్ ప్రొపర్టీస్ కలిగి ఉంటాయి.
ముల్తానీ మట్టితో ప్రయోజనాలు
- ముఖంపై ఉన్న నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు తగ్గించేందుకు సహాయపడుతుంది.
- మొటిమలు, చర్మంపై ఏర్పడే చిట్లిళ్లను తగ్గిస్తుంది.
- చర్మానికి అవసరమైన పోషణ అందించి ఆరోగ్యంగా ఉంచుతుంది.
- చర్మాన్ని మృదువుగా చేసి సహజమైన మెరుపు అందిస్తుంది.
ముల్తానీ మట్టి, చందనం రెండూ కూడా ముఖానికి చక్కటి ప్రయోజనాలు అందిస్తాయి. మీ చర్మపు స్వభావాన్ని బట్టి సరైనదాన్ని ఎంచుకోవడం ముఖ్యం. పొడి చర్మం ఉన్నవారు తేమను అందించే పదార్థాలతో ముల్తానీ మట్టిని వాడితే మంచి ఫలితం పొందొచ్చు. అలాగే జిడ్డు చర్మం ఉన్నవారు చందనం లేదా ముల్తానీ మట్టిని ఉపయోగించడం వల్ల అదనపు నూనె తగ్గి చర్మం మృదువుగా మారుతుంది.