Health: స్వీట్స్ తినకుండా ఉండలేకపోతున్నారా.. ఈ దుష్ప్రయోజనాలు తెలిస్తే వాటి జోలికి కూడా వెళ్లరు..

స్వీట్స్ (Sweets).. తలుచుకుంటేనే నోరూరిపోతోంది కదూ.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. స్వీట్స్ తినడం వల్ల వచ్చే నష్టాలు మనకు తెలిసినప్పటికీ.. కొన్ని సార్లు స్వీట్స్ తినకుండా ఉండలేం. పరిమితికి మించి...

Health: స్వీట్స్ తినకుండా ఉండలేకపోతున్నారా.. ఈ దుష్ప్రయోజనాలు తెలిస్తే వాటి జోలికి కూడా వెళ్లరు..
Sweets
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 13, 2022 | 7:25 PM

స్వీట్స్ (Sweets).. తలుచుకుంటేనే నోరూరిపోతోంది కదూ.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. స్వీట్స్ తినడం వల్ల వచ్చే నష్టాలు మనకు తెలిసినప్పటికీ.. కొన్ని సార్లు స్వీట్స్ తినకుండా ఉండలేం. పరిమితికి మించి స్వీట్స్ తింటే అందుకు తగ్గట్టే వ్యాయామం చేయాలనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. స్వీట్స్ ఐటమ్స్ లో అధికంగా మైదా, చక్కెర ను వినియోగిస్తారు. చక్కెరతో (Sugar) చేసిన పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అది శరీరంలో గ్లైకోజెన్‌ గా నిల్వ ఉంటుంది. అందుకే స్వీట్స్ ఎక్కువగా తీసుకున్న తర్వాత కచ్చితంగా నీరు తాగాలి. ఇలా చేయడం వల్ల అలసట, తలనొప్పి సమస్యలను దూరం చేస్తుంది. అయితే ఆర్టిఫిషియల్ స్వీట్స్ కాకుండా ప్రకృతి ద్వారా లభ్యమయ్యే తీపి వస్తువులను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవడం మంచిది. ఇది రక్తంలో చక్కెర లెవెల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. కూరగాయలు, గుడ్లు, చికెన్, ప్రొటీన్ ఫుడ్స్, క్వినోవా, తృణధాన్యాలు తీసుకోవడం ఉత్తమం. తిన్న స్వీట్స్ కు తగ్గట్టుగా వర్కౌట్స్ చేయడం, నీరు ఎక్కువగా తీసుకోవడం వంటివి చేస్తుండాలి.

ఎక్కువ మోతాదులో స్వీట్స్ తినడం వల్ల శక్తి కోల్పోయే ఆవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా అలసట, నీరసం, బద్ధకం, ఏకాగ్రత కోల్పోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. చక్కెరతో చేసిన పదార్థాలు తిన్న తర్వాత లంచ్ చేస్తే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. రోగనిరోధక శక్తిపై ప్రభావం పడి, బ్యాక్టీయా, వైరల్ ఇన్ఫెక్షన్లు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పంచదార, పంచదార ఉత్పత్తులు తీసుకోవడం వల్ల డిప్రెసివ్ గా అనిపిస్తుంది. షుగర్ తీసుకోవడం వల్ల తాత్కాలికంగా ఒత్తిడి నుంచి బయటపడినా తర్వాత ఆరోగ్యంపై పెను ప్రబావం చూపుతుందన్న విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!